Rain effect: కోదాడ రోడ్డు బ్లాక్.. విజయవాడ దారి మళ్లింపు!

భారీ వర్షాలకు వాగులు పొంగి రోడ్లన్నీ జలమయమయ్యాయి. కోదాడ జగ్గయ్యపేట వద్ద రోడ్డు బ్లాక్‌ కావడంతో హైదరాబాద్‌ నుంచి విజయవాడకు వెళ్లే వాహనాలను దారి మళ్లించారు. మిర్యాలగూడ, గుంటూరు మీదుగా విజయవాడకు వెళ్లాలని పోలీసులు తెలిపారు.

New Update
Traffic : హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు.. రాత్రి 9 గంటల వరకూ నరకమే!

Hyd- Vijayawada: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల నేపథ్యంలో పలుచోట్ల భారీ ట్రాఫిక్ ఏర్పడింది. దీంతో జనజీవనం స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. కొన్నిచోట్ల ప్రధాన రహదారులు వాహనాలతో కిక్కిరిసిపోగా.. సూర్యాపేట జిల్లా కోదాడలో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. నందిగామ వద్ద వాగు పొంగిపొర్లి హైవేపైకి నీరు చేరింది. దీంతో హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్లే వాహనాలను ఖమ్మం వైపుగా మళ్లించారు.

నార్కట్‌పల్లి నుంచి వయా మిర్యాలగూడ..
ఈ మేరకు జగ్గయ్యపేట వద్ద రోడ్డు బ్లాక్‌ కావడంతో హైదరాబాద్‌ నుంచి విజయవాడకు వెళ్లేందుకు నార్కట్‌పల్లి నుంచి వయా మిర్యాలగూడ, గుంటూరు మీదుగా విజయవాడకు వాహనాలను మళ్లించారు. వాహనదారులు నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా గమ్యాన్ని చేరుకోవాలని పోలీసులు సూచించారు. రోడ్డుప పక్కన గ్రామాల ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు పాటించాలని నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు.

Advertisment
తాజా కథనాలు