దేశవ్యాప్తంగా వానలే వానలు రుతుపవనాలు దేశవ్యాప్తంగా విస్తరించాయి. ఈనేపథ్యంలో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా కొన్ని చోట్ల జనజీవనానికి తీవ్ర అంతరాయం కలిగింది. రుతుపవనాల ప్రభావంతో రానున్న రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. By Bhoomi 30 Jun 2023 in Scrolling వాతావరణం New Update షేర్ చేయండి రుతుపవనాలు దేశమంతటా విస్తరించడంతో పలుచోట్ల భారీ వర్షాలు కురస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రోడ్లపైకి భారీగా వరద నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, గోవా, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. VIDEO | A portion of an under-construction bridge collapses due to heavy rains in Chhattisgarh's Durg district. More details are awaited. pic.twitter.com/Uqgea2we0f— Press Trust of India (@PTI_News) June 29, 2023 ఇక అటు గుజరాత్ రాష్ట్రాన్నీ భారీ వర్షాలు ముంచెత్తాయి. ఇటీవలే బిపర్ జాయ్ తుఫాను కారణంగా అతలాకుతలమైన గుజరాత్‌లో ప్రస్తుతం రుతుపవనాల ప్రభావంతో మరోసారి వర్షం దంచికొట్టింది. వల్సాద్, సూరత్, నవ్‌సారీ, తాపి జిల్లాల్లో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వల్సాద్ జిల్లాలోని పర్ది తాలూకాలో 18 సెంటీమీటర్ల వర్షం కురిసింది. నవ్సారి, వల్సాద్ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అహ్మదాబాద్‌లోనూ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ క్రమంలో గుజరాత్ రాజ్‌కోట్‌లోని వివిధ ప్రాంతాలలో రాత్రి నుండి నిరంతర వర్షం కురుస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న ఈ వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్తున్నారు. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో కురిసిన నిరంతర వర్షానికి, కొన్ని గ్రామాల్లో ఇళ్లలోకి నీరు వచ్చి చేరాయి. రోడ్లు మొత్తం జలమయ్యాయి. నడుము భాగం వరకు వచ్చిన నీళ్లతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్తున్నారు. వర్షం కారణంగా ఇంట్లోకి నీరు చేరడంతో ఇంట్లోని వస్తువులన్నీ తడిసి ముద్దయ్యాయి. నార్త్ అండ్ సౌత్ గుజరాత్ లోని నవ్‌సారి, వల్సాద్, సబర్‌కాంత, ఆరావళి, పోర్‌బందర్ సహా అనేక జిల్లాల్లో రాబోయే మూడు రోజులపాటు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని IMD అంచనా వేసింది. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి