TTD: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం!

తిరుమలలో భక్తుల రద్దీ మళ్లీ పెరిగింది. రెండు రోజుల క్రితం భక్తుల రద్దీ తగ్గినట్లు అనిపించినప్పటికీ.. మళ్లీ భక్తుల రద్దీ పెరిగింది. శుక్ర, శని, ఆదివారాలు కావడంతో తిరుమలకు భక్తులు అధిక సంఖ్యలో చేరుకుంటున్నారు. వారాంతంలో తిరుమలలో భక్తుల రద్దీ అధికంగానే ఉంటుంది.

New Update
TTD: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం!

TTD: తిరుమలలో భక్తుల రద్దీ మళ్లీ పెరిగింది. రెండు రోజుల క్రితం భక్తుల రద్దీ తగ్గినట్లు అనిపించినప్పటికీ.. మళ్లీ భక్తుల రద్దీ పెరిగింది. శుక్ర, శని, ఆదివారాలు కావడంతో తిరుమలకు భక్తులు అధిక సంఖ్యలో చేరుకుంటున్నారు. వారాంతంలో తిరుమలలో భక్తుల రద్దీ అధికంగానే ఉంటుంది. భక్తులు తిరుమలకు భారీగా తరలి వస్తున్న తరుణంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా టీటీడీ అధికారులు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శుక్రవారం మూడు నుంచి నాలుగు గంటల సమయం పట్టే అవకాశాలున్నాయని టీటీడీ అధికారులు పేర్కొన్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లన్నీ నిండిపోయాయి. దీంతో భక్తులు క్యూ లైనులో వేచి ఉన్నారు. టోకెన్‌ లేని భక్తులకు సర్వ దర్శనానికి 18 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు వివరించారు.

Also read: తెలుగు జాతి నిండుదనం..ఆర్థిక సంస్కరణల చాణక్యుడు..పీవీ జయంతి నేడు!

Advertisment
తాజా కథనాలు