బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా నగరంలో రాగల మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ నిపుణులు తెలిపారు.
ఈ క్రమంలోనే నగరంలోని పాఠశాలలకు జులై 27 వరకు సెలవులు ప్రకటించాలని ప్రభుత్వాన్ని పలువురు కోరారు. ఆన్ లైన్ క్లాసుల ద్వారా తరగతులు నిర్వహించాలని తల్లిదండ్రులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
విపరీతంగా వర్షం పడుతుండటం వల్ల ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఇస్తేనైనా ట్రాఫిక్ సమస్య కొంతమేర తగ్గుతుందని పలువురు నెటిజన్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా హైటెక్ సిటీ, కొండాపూర్, గచ్చిబౌలీ, పరిసర ప్రాంతాల్లో వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.