Chiranjeevi: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలన్న మెగాస్టార్

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని మెగాస్టార్ చిరంజీవి కోరారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దు.వైరల్ ఫీవర్ వంటివి వచ్చే ప్రమాదం ఉంది. విపత్తులు వచ్చినప్పుడు ప్రజలకు, బాధితులకు మా అభిమానులు ఎల్లప్పుడూ అండగా ఉంటారు.

New Update
Chiranjeevi : అది నా బాధ్యత సీఎం గారూ!

Chiranjeevi: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని మెగాస్టార్‌ చిరంజీవి కోరారు. ప్రజలు ఎవరైనా సరే అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సోషల్‌ మీడియా వేదికగా కోరారు. ' తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. పలు గ్రామాలు, జాతీయ రహదారులు నీటితో మునిగిపోయాయి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి.

మీ కుటుంబ సభ్యుడిగా నా మనవి ఒక్కటే.. అత్యవసరం అయితే తప్ప ఎవరూ బయటకు రావొద్దు. ఈ వర్షాల వల్ల వైరల్ ఫీవర్ వంటివి వచ్చే ప్రమాదం ఉంది. ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు ప్రజలకు, బాధితులకు మా అభిమానులు ఎల్లప్పుడూ అండగా ఉంటున్నారు. ఇప్పుడూ కూడా వారంతా అండగా ఉంటారని ఆశిస్తున్నాను' అని చిరంజీవి ట్వీట్ లో పేర్కొన్నారు.

Also Read: ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్న పిఠాపురం ఎమ్మెల్యే!

Advertisment
Advertisment
తాజా కథనాలు