మరో రెండు రోజుల్లో భారీ వర్షాలు

ఏపీ, తెలంగాణలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో గత కొద్దిరోజులుగా కురిసిన వర్షాలకు జనాలు ఇక్కట్లు పడుతున్నారు. తాజాగా వాతావరణ శాఖ మరో హెచ్చరికను జారీ చేసింది. మరో 2, 3 రోజులు తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచేత్తనున్నాయి. రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశించినప్పటికి ఏపీ, తెలంగాణలో ఇప్పటికి చాలా చోట్ల వాన జాడలేదు. మరికొన్ని ప్రాంతాల్లో ఇంకా వేసవి తాలుక ఎండలతో జనం మాడిపోతున్నారు.

New Update
మరో రెండు రోజుల్లో భారీ వర్షాలు

Heavy rains in Telugu states in next two days

ఏపీలోని కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయని వాతావరణశాఖ వెల్లడించింది. అలాగే మిగిలిన ప్రాంతాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇది ఇలా ఉండగా.. దేశంలోని చాలా రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు మరింత విస్తరిస్తున్నాయని.. అదే సమయంలో వాయువ్య ఉత్తర ప్రదేశ్ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. హైదరాబాద్‌లో వర్షాలు సాయంత్రం లేదా రాత్రి భారీగా కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

ఉత్తర కోస్తా, యానాంలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. అటు భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.

బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది. అలాగే బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈ ఉపరితల ఆవర్తనం బలపడి రానున్న రోజుల్లో అల్పపీడనంగా మారనుంది. జూలై 4 మధ్యాహ్నం నుంచి జూలై 7 ఉదయం మధ్యలో ఆంధ్ర​, తెలంగాణ రాష్ట్రంలో అల్పపీడనం వర్షాలు ఉంటాయి. ఇక ఏపీలో కూడా భారీగా వర్షాలు కురవనున్నాయి. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు తెలిపారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు