/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/j-jpg.webp)
Heavy Rain in Hyderabad: హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, వాయుగుండంగా మారిందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఒక్కసారిగా వాతావరణం మారిపోయి భారీ వర్షం కురవడంతో ప్రయాణికులు, వాహనదారులు అవస్ధలు పడ్డారు.
పలుచోట్ల రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పిడింది. లోతట్లు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంకి ఎల్లో అలెర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. రాబోయే 3 రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
Also Read: చీరతో, చెప్పులు ధరించి మమత బెనర్జీ పరుగులు.. పియానో వాయించిన దీదీ!
హైదరాబాద్ నగరంపై వరుణుడు మరోసారి తన ప్రతాపం చూపించాడు. మధ్యాహ్నం వరకు ప్రశాంతంగా ఉన్న వాతావరణ కాస్త సాయంత్రం సమయంలో ఒక్కసారిగా మారిపోయింది. మేఘావృతం కాకుండానే కుండపోతగా వర్షం కుమ్మరించింది. ఉన్నట్టుండి కురిసిన భారీ కుండపోత వర్షంతో.. నగరంలోని రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎదుటి వ్యక్తి కనిపించనంతగా వర్షం కురియటంతో.. రోడ్లపై ఎక్కికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. సరిగ్గా.. ఆఫీసుల నుంచి ఉద్యోగులు బయటికి వచ్చే సమయంలోనే ఉన్నట్టుండి వర్షం కురియటంతో.. ద్విచక్రవాహనదారులంతా నిండా తడిసిపోవాల్సి వచ్చింది. భారీ వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో చెట్ల కొమ్మలు విరిగిపడి.. కరెంట్ సరఫరా నిలిచిపోయింది.
బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్, లక్డీకాపూల్, నాంపల్లి, ట్యాంక్‌బండ్, అమీర్‌పేట్, ఎస్సార్‌నగర్, బేగంపేట, మెహిదీపట్నం, సికింద్రాబాద్, ఎల్బీనగర్, దిల్ సుఖ్ నగర్, మియాపూర్, కూకట్ పల్లి, లింగపల్లి తదితర ప్రాంతాల్లో జోరు వాన పడింది. ఎదుటి వాహనాలు కూడా కనపడనంత స్థాయిలో వర్షం కురియటంతో.. పలు జంక్షన్‌లో నీళ్లు నిలిచి వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో ట్రాఫిక్ పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. నీళ్లు నిలిచినచోట.. చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. అత్యవసరమైతేనే ఇళ్ల నుంచి బయటకు రావాలంటూ హెచ్చరికలు జారీ చేశారు.
ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఈ రోజు, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. అలాగే శనివారం రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు మిగిలిన జిల్లాలకు రాబోయే మూడు రోజుల పాటు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరోవైపు గ్రేటర్ హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో రాబోయే 3 రోజులలో మోస్తరు వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ ప్రకటించింది.
Also Read: ప్రైవేట్ జెట్‌లో మంటలు.. రన్‌వే స్కిడ్.. 8 మంది ప్రయాణికులు!