Hyderabad Rains: హైదరాబాద్‌లో భారీ వర్షం

హైదరాబాద్‌లో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. నాంపల్లి, సికింద్రాబాద్, మాదాపూర్, జూబ్లీ హిల్స్ ప్రాంతాల్లో వర్షంతో వాహనదారులు ఇక్కట్లు పడుతున్నారు. పలు ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి.

Hyderabad Rains: హైదరాబాద్‌లో భారీ వర్షం
New Update

Hyderabad Rains: హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది. నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. రుతుపవనాల ప్రభావంతో ఏపీ, తెలంగాణలో వర్షాలు పడుతున్నాయి. రెండు రాష్ట్రాల్లో సాయంత్రం వేళల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలో ఇవాళ, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ షాక్ అంచనా వేసింది.

వికారాబాద్‌, మహబూబ్‌నగర్, వనపర్తి, నారాయణపేటలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. నిర్మల్, నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్‌, మేడ్చల్ మల్కాజ్‌గిరి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షం పడే అవకాశం ఉందని పేర్కొంది.



ఏపీవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పింది. మరోవైపు రెండు రాష్ట్రాలపై ద్రోణి ఎఫెక్ట్ తో ఈనెల 10 వరకు అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. కొన్నిచోట్ల పిడు

#hyderabad-rains
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe