Rains : భారీ వర్షం.. గోడకూలి ముగ్గురు మృతి..! హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా మారింది. నగరంలో పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. దట్టంగా మేఘాలు అలుముకున్నాయి. రెమాల్ తుపాను, ఉపరితల ఆవర్తనంతో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వాన పడుతోంది. రాష్ట్రంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. By Jyoshna Sappogula 26 May 2024 in Latest News In Telugu హైదరాబాద్ New Update షేర్ చేయండి Rain Alert : హైదరాబాద్ (Hyderabad) లో వాతావరణం (Weather) ఒక్కసారిగా మారింది. నగరంలో పలుచోట్ల భారీ వర్షం (Heavy Rain) కురుస్తోంది. మేఘాలు దట్టంగా అలుముకున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. రెమాల్ తుపాను (Remal Toofan), ఉపరితల ఆవర్తనంతో..ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడుతోంది. జూబ్లీహిల్స్, మాదాపూర్, ఫిల్మ్‌నగర్, వనస్థలిపురం, ఎల్బీనగర్, హయత్‌నగర్, నాగోల్, కొత్తపేటలో వాన దంచికొడుతుంది. వర్షా ప్రభావంతో వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. Also Read: రెమాల్ తుపాన్ ఎఫెక్ట్.. ఏపీకి బిగ్ అలర్ట్..! వికారాబాద్, భువనగిరి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మరోవైపు సంగారెడ్డి, రంగారెడ్డి, నల్గొండ, సూర్యాపేట, నారాయణపేట, మహబూబ్‌నగర్, గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూలు, నల్గొండ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. మహబూబ్‌నగర్ జిల్లాలో సైతం భారీ వర్షం కురుస్తోంది. నాగర్‌కర్నూలు జిల్లాలో గోడకూలి ముగ్గురు మృతి చెందారు. #heavy-rains #hyderabad-rains #remal-toofan మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి