East Godavari: తూర్పుగోదావరి జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జిల్లా వ్యాప్తంగా ఏజెన్సీ ప్రాంతాలలో వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గోదావరి నదిలో భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో పోలవరం ప్రాజెక్ట్ స్పిల్ వే వెనక భాగంలో ఉన్న దేవీపట్నం మండలం లోని గండి పోచమ్మ ఆలయం లోకి పూర్తిగా వరద నీరు వచ్చి చేరింది. ఆలయ గర్భగుడిలో కూడా వరద నీరు వచ్చిన పరిస్థితులు కనిపిస్తున్నాయి.
Also Read: మాకు డి పట్టాలు ఇవ్వండి.. మన్యం జిల్లాలో గిరిజనుల ఆందోళన..!
ఈ నేపథ్యంలోనే ధవలేశ్వరం బ్యారేజ్ వద్ద నీటిమట్టం పది అడుగులు దాటి గోదావరి ప్రవహిస్తుండడంతో 175 గేట్లకు గాను 130 గేట్లను ఎత్తి గోదావరి నీటిని సముద్రంలోకి ఇరిగేషన్ అధికారులు విడుదల చేశారు. అదేవిధంగా లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
This browser does not support the video element.