/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/rains-4-jpg.webp)
Heavy Rains in Telangana: హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఎండ తీవ్రత, ఉక్కపోత నుంచి నగరవాసులు ఉపశమనం పొందుతున్నారు. నగరంలో పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. కూకట్‌పల్లి, నిజాంపేట, బాచుపల్లి, చందానగర్..జూబ్లీహిల్స్, మాదాపూర్, ఫిల్మ్‌నగర్‌లో వర్షం దంచికొడుతుంది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడుతోంది. దీంతో ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతుంది.
గాలి వాన బీభత్సం.. విరిగి పడుతున్న తాటి చెట్లు
జగిత్యాల - పెగడపల్లి మండలంలోని నంచర్ల గ్రామంలో భారీ ఈదురుగాలుల వల్ల తాటి చెట్టు మధ్యలోకి విరిగిపోయింది.
విరిగిన తాటి చెట్టు విద్యుత్ స్తంభంపై పడటంతో స్తంభం కూడా విరిగి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. pic.twitter.com/Z2jUrgzve3
— Telugu Scribe (@TeluguScribe) May 7, 2024
తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల్లో వడగళ్ల వాన పడుతుంది. మరో మూడు రోజులపాటు రెయిన్ అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. 9 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయన్నారు.
#Raining in SR Nagar, Several areas of #Hyderabad.#HyderabadRainspic.twitter.com/8WBkA1o3T1
— Arbaaz The Great (@ArbaazTheGreat1) May 7, 2024
పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశరు. ఆసిఫాబాద్, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, జనగామ.. నాగర్ కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు.
#Miyapur Recorded 108.8mm in last 2hrs Spell⛈️💥
Entire North #Hyderabad City Seen 40mm+ Rainfall& Still Continuing..., Perfect relief from Heatwave😍#Hyderabadrainspic.twitter.com/Vn7oHt0wdW
— Hyderabad Rains (@Hyderabadrains) May 7, 2024
Also Read: హైదరాబాద్ కు ప్రధాని మోదీ.. ఈ రూట్ లో ట్రాఫిక్ ఆంక్షలు..!