Rains in Ap, Telangana: లైట్‌ తీసుకుంటే అంతే..ఈరోజు నుంచి వర్షాలు..కుమ్ముడే కుమ్ముడు!

ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రానున్న మూడు రోజుల్లో హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలోని 11 జిల్లాలకు ఇప్పటికే ఆరెంజ్‌ అలర్ట్ జారీ చేశారు. అటు ఏపీలోని దక్షిణ కోస్తాలో సెప్టెంబర్ 7 వరకు భారీ వర్షాలు కురుస్తాయి.

Rains in Ap, Telangana: లైట్‌ తీసుకుంటే అంతే..ఈరోజు నుంచి వర్షాలు..కుమ్ముడే  కుమ్ముడు!
New Update

Heavy rains likely to prevail over Telangana, Andhra Pradesh till September 7: రెండు తెలుగు రాష్ట్రాలపై వరుణుడు మరోసారి విరుచుకుపడనున్నాడు. ముఖ్యంగా తెలంగాణ(Telangana)కు ఇవాళ్టి నుంచి దంచుడే దంచుడు. తెలంగాణలో ఇవాళ్టి నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణశాఖ హెచ్చరించింది. 11 జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్(orange alert) జారీ చేసింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్(Yellow alert) జారీ ఇచ్చింది. నిజామాబాద్‌, జగిత్యాల, సిరిసిల్ల , కరీంనగర్, పెద్దపల్లి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇక ఎల్లో అలర్ట్ జారీ చేసిన జిల్లాలకు భారీ నుంచి అతిభారీ వర్షాలు పడుతాయి. ఇటు హైదరాబాద్‌లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పింది. ఎల్లుండు(సెప్టెంబర్‌ 6) వరకు తెలంగాణకు భారీ వర్షాలు ఉంటాయని తెలిపింది.

పిడుగుపాటుకు ప్రాణం పోయింది:
బంగాళాఖాతం(bay of Bengal)లో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రానున్న మూడు రోజుల్లో హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో వర్షంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్‌రావు(talasani srinivasa rao) జీహెచ్‌ఎంసీ(GHMC)ని ఆదేశించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, ఇళ్లలోనే ఉండాలని మంత్రి ప్రజలకు సూచించారు. ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆదివారం ఈదురు గాలులతో కూడిన వర్షం కురవడంతో పిడుగుపాటుకు 30 ఏళ్ల వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. పిడుగుపాటుకు గురైన వ్యక్తి సతీశ్‌(30)గా గుర్తించారు క్రికెట్ ఆడేందుకు సిరిసిల్లలోని గణేష్ నగర్ మైదానానికి వెళ్లిన సతీశ్‌. వర్షం పడుతుండగా చెట్టు కింద తలదాచుకున్నాడు.. అదే సమయంలో పిడుగుపాటుకు గురవడంతో చనిపోయాడు. అటు మహబూబ్‌నగర్‌ జిల్లాలో భారీ కటౌట్‌ పడిపోవడంతో మూవింగ్‌ దెబ్బతింది. సిరిసిల్ల జిల్లా ములవాగులోకి వరద నీరు చేరింది. నివేదికల ప్రకారం నిజామాబాద్‌లో 257 మిల్లీమీటర్లు, కామారెడ్డిలో 15 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మహబూబ్‌నగర్‌లోని మిడ్జిల్‌లో ఆదివారం వర్షం కురిసింది. రోడ్లపై నీరు ప్రవహించడంతో వెలుగొమ్ము-కొత్తూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దుమ్ముదుంబి నదికి భారీగా వరదనీరు వచ్చి చేరింది.

ఏపీలోనూ తప్పదు:
వాయువ్య బంగాళాఖాతంలో రేపటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ(IMD) చెప్పింది. ఈశాన్య బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. మరో తుఫాను వాయుగుండం పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా ఆంధ్రప్రదేశ్ తీరానికి సమీపంలో సగటు సముద్ర మట్టానికి 5.8 కి.మీ ఎత్తులో ఉంది. ఈ వాతావరణ పరిస్థితులు రాయలసీమ, కోస్తా ఆంధ్ర ప్రదేశ్‌లో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు కారణమవుతున్నాయి. అల్పపీడనం పశ్చిమ దిశగా కదులుతుందని, దీనివల్ల ఏపీలోని ఉత్తర జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఉత్తరాంధ్ర, రాయలసీమలోని పలు జిల్లాల్లో వరదలు, నీటి ఎద్దడి ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అల్పపీడనం ప్రభావంతో ఉత్తర, దక్షిణ కోస్తాలో సెప్టెంబర్ 7 వరకు భారీ వర్షాలు కురుస్తాయి.

ALSO READ: చిరుతపులితో సెల్ఫీలు..ఓరి..మీ వేషాలో.. ఎగిరి తంతే ఏట్లో పడతారు!

#heavy-rains-in-telangana #heavy-rains-in-ap
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe