Heavy Rains: ఏలూరు, అల్లూరి జిల్లాలకు రెడ్ అలర్ట్! బంగాళాఖాతంలో ఒడిశా, ఉత్తరాంధ్ర తీర ప్రాంతంలో అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. ఇది శనివారం తెల్లవారుజామున వాయువ్య దిశగా పయనించి పూరీ సమీపంలో ఒడిశా తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. By Bhavana 19 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ వైజాగ్ New Update షేర్ చేయండి Heavy Rains: బంగాళాఖాతంలో ఒడిశా, ఉత్తరాంధ్ర తీర ప్రాంతంలో అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. ఇది శనివారం తెల్లవారుజామున వాయువ్య దిశగా పయనించి పూరీ సమీపంలో ఒడిశా తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఆ తర్వాత వాయుగుండం క్రమంగా బలహీనపడనుంది. ప్రస్తుతం వాయుగుండం పూరీకి 70 కిమీ, గోపాలపురికి 130, కళింగపట్నానికి 240 కిమీల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు తెలుస్తుంది. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురవనున్నట్లు ఏపీ వాతావరణ కేంద్రం పేర్కొంది. రాయలసీమలో చెదురుమదురు వర్షాలు పడనున్నట్లు తెలిపింది. ఉత్తరాంధ్రకు భారీ నుంచీ అతిభారీ వర్ష సూచన తేసింది. ఏలూరు, అల్లూరి జిల్లాలలో అత్యధికంగా వర్షాలు పడతాయని ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఎన్టీఆర్, గుంటూరు, ఉభయగోదావరి జిల్లాలు, అమలాపురం, కోనసీమ, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నట్లు తెలిపింది. రాయలసీమ జిల్లాలలో 40 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వివరించింది. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది… భారీ వేగంతో గాలులు వీస్తాయని.. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసింది. అధికారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ సూచించింది. ఇప్పటికే అత్యవసర సహాయక చర్యల కోసం 3ఎస్డీఆర్ఎఫ్, 2 ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలు మోహరించినట్లు ఏపీ విపత్తుల సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. లోతట్టు ప్రాంతాల్లో వరద ప్రవహిస్తున్నవాగులు,కాలువలు దాటే ప్రయత్నం చేయరాదని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేశారు. #rains #floods మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి