Weather: తుపానుగా మారిన తీవ్ర వాయుగుండం.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన..

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం.. తుపానుగా పరిణమించిందని వాతావణ శాఖ అధికారులు ప్రకటించారు. నవంబర్ 18న ఈ తుపాను తీరం దాటే అవకాశం ఉందన్నారు. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షం కురిసే అవకాశం ఉంది.

New Update
Weather: తుపానుగా మారిన తీవ్ర వాయుగుండం.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన..

Heavy Rain Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం.. తీవ్ర వాయుగుండగా మారి తుపానుగా పరిణమించిందని అమరావతి (Amaravati) వాతావరణ కేంద్రం  అధికారులు ప్రకటించారు. విశాఖపట్నానికి తూర్పు ఆగ్నేయ దిశలో 420 కిలోమీటర్లు, పరదీప్(ఒడిశా)కు దక్షిణ ఆగ్నేయంగా 270 కిలోమీటర్లు, దిఘా(పశ్చిమ బెంగాల్)కు దక్షిణ నైరుతి దిశలో 410 కిలోమీటర్లు దూరంలో కేంద్రీకృతమై ఉందని తెలిపారు. ఈ వాయుగుండం ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ ఇవాళ అంటే శుక్రవారం నాడు తుపానుగా మారిందని వివరించారు. ఈ తుపానుకు 'మిధిలి' (Cyclone Midhili) అని పేరు పెట్టారు అధికారులు. కాగా, ఈ తుపాను ఈ నెల 18వ తేదీన ఉదయం బంగ్లాదేశ్‌ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని చెబుతున్నారు.

అయితే, ఈ తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ (Telangana) రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. ముఖ్యంగా దీని ప్రభావం ఏపీలో తీర ప్రాంతాలపై ఉంటుందన్నారు. సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని సూచించారు. తుపాను ప్రభావంతో తీర్ర ప్రాంతంలో బలమైన ఈదురు గాలులు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు వాతావరణ కేంద్రం అధికారులు. ఇదిలాఉంటే.. బంగాళాఖాతంలో మరికొద్ది రోజుల్లో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు అధికారులు. ఈశాన్య రుతుపవనాల ప్రభావం కూడా ఉంటుందని, నవంబర్ 28వ తేదీ తరువాత రాష్ట్రంలో వర్షాలు పెరిగే అవకాశం ఉందని చెప్పారు.

Also Read:

 సీఎం కేసీఆర్ సభలో బుల్లెట్ల కలకలం

యాక్సిస్ బ్యాంక్, మణప్పురం ఫైనాన్స్ కు ఆర్బీఐ షాక్!

Advertisment
తాజా కథనాలు