/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/ap-6.jpg)
Andhra pradesh : ఏపీని వాన గండం వెంటాడుతుంది. భారీ వర్షాలకు బుడమేరు మహోగ్రరూపం దాల్చడంతో బెజవాడ ముంపునకు గురైన సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే వరద భారీ నుంచి విజయవాడ ప్రజలు కాస్త కోలుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. వర్షపు నీరుతో లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Also Read: పాఠశాలలో మరోసారి కాల్పుల కలకలం.. నలుగురు విద్యార్థులు మృతి..!
అయితే, ఏపీకి మరో గండం ఉన్నట్లు అధికారులు అంటున్నారు. రాబోయే 24 గంటల్లో కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్షలు పడనున్నాయని తెలిపారు. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.
దీంతో అల్లూరి, మన్యం జిల్లాలకు అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాలో అతి భారీ వర్షలు పడనున్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, ఎన్టీఆర్, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, పల్నాడు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.