Nagarjuna Sagar : నాగార్జునసాగర్ ప్రాజెక్టు (Nagarjuna Sagar Project) కు వరద (Flood) ప్రవాహం కొనసాగుతోంది. 26 గేట్ల నుండి నీటి విడుదల చేశారు.16 గేట్లు 10 అడుగుల మేర.. 10 గేట్లు 5 అడుగుల మేర పైకి ఎత్తి దిగువకు నీటిని అధికారులు విడుదల చేశారు. ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 3,60,691 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు ఉండగా.. ప్రస్తుత నీటి మట్టం 588 అడుగులు వద్ద ఉంది. కాగా నిండుకుండలా ఉన్న నాగార్జున సాగర్ ను చేసేందుకు జనాలు లైన్ కట్టారు.
రెండో శనివారం, ఆదివారం సెలవు దినం కావడంతో పర్యాటకుల సంఖ్య మరింత పెరిగింది. నాగార్జున సాగర్ కు వెళ్లే రోడ్డు మార్గం వాహనాలతో రద్దీగా మారింది. రెండేళ్ల తరువాత గేట్లు ఎత్తడంతో అక్కడి స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రాజెక్ట్ చుట్టూ ఉన్న గ్రామాలకు పంట సాగు కొరకు కాలువల నుంచి నీటిని విడుదల చేస్తున్నారు.
Also Read : విరిగిపడిన కొండచరియలు..128 రోడ్లు మూసివేత!