Jurala Project: జూరాల ప్రాజెక్ట్ 10 గేట్లు ఎత్తివేత జూరాల ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కొనసాగుతోంది. 10 గేట్లు ఎత్తి దిగువకు నీటిని అధికారులు విడుదల చేశారు. ఇన్‌ఫ్లో 86 వేల క్యూసెక్కులు.. ఔట్ ఫ్లో 82 వేల 700 క్యూసెక్కుల వద్ద కొనసాగుతోంది. By V.J Reddy 24 Aug 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Jurala Project: జూరాల ప్రాజెక్ట్‌కు జలకళ వచ్చింది. 10 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు అధికారులు. ఇన్‌ఫ్లో 86 వేల క్యూసెక్కులు.. ఔట్ ఫ్లో 82 వేల 700 క్యూసెక్కుల వద్ద కొనసాగుతోంది. పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 318.516 మీటర్లు ఉండగా.. ప్రస్తుత నీటి సామర్థ్యం 318.400మీటర్ల వద్ద ఉంది. ఎగువ, దిగువ జల విద్యుత్ కేంద్రాల్లోని 5 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. కాగా గేట్లు ఎత్తడంతో జూరాలకు భారీ ఎత్తున పర్యాటకులు చేరుకుంటున్నారు. శ్రీశైలానికి కొనసాగుతున్న వరద.. కృష్ణా బేసిన్ ఎగువ పరీవాహకంలో వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టుకు వరదనీరు పెరిగింది. దీంతో శ్రీశైలం జలాశయానికి భారీగా వరద వచ్చి చేరుతోంది. ఎగువన ఉన్న సుంకేసుల బ్యారేజీకి భారీగా వరద నీరు వస్తుండడంతో..ఆ నీటిని అంతేస్థాయిలో శ్రీశైలానికి వదులుతున్నారు. రెండు వైపులా జలవిద్యుత్తు ఉత్పాదనతో శ్రీశైలం నుంచి 69,132 క్యూసెక్కులను నాగార్జున సాగర్‌కు వదిలేస్తున్నారు. అయినా కూడా శ్రీశైలం జలాశయం నిండపోతుండడంతో ఇక్కడ మరో సారి గేట్లు ఎత్తక తప్పని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి 1.37 లక్షల క్యూసెక్కుల నీరు శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు నీటి మట్టం గరిష్ఠ స్థాయి 885 అడుగులు కాగా..ఎగువ నుంచి వచ్చి చేరిన నీటితో 884.2 అడుగుల నీరు నిండిపోయింది. ప్రాజెక్టు గరిష్ఠ నీటినిల్వ సామర్థ్యం 215.8 టీఎంసీలకు గానూ, ప్రస్తుతం 210.99 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాల ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. వరద ఇలాగే కొనసాగి గరిష్ట స్థాయి నీటి మట్టాన్ని చేరుకున్నా లేదా దాటిపోయినా గేట్లు ఎత్తాల్సిందేనని అధికారులు చెబుతున్నారు. #jurala-project మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి