Heat Wave Effect: గత నాలుగు రోజుల్లో దేశంలో వేడి - వడదెబ్బ కారణంగా 320 మందికి పైగా మరణించారు. గత మూడు రోజుల్లో ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 100 మంది ప్రాణాలు కోల్పోయారు. బీహార్‌లో గత మూడు రోజుల్లో 69 మంది వడదెబ్బ కారణంగా మరణించారు. యూపీ-బీహార్‌లో శుక్రవారం దాదాపు 40 మంది మృతి చెందినట్లు వార్తలు వచ్చాయి. వీరిలో 25 మంది ఉద్యోగులు, అధికారులు లోక్‌సభ ఎన్నికల విధుల్లో నిమగ్నమై ఉన్నారు. గత 4 రోజుల్లో రాజస్థాన్‌లో 60 మంది, జార్ఖండ్‌లో 37, ఒడిశాలో 18, మధ్యప్రదేశ్‌లో 2, ఢిల్లీలో ఒకరు చనిపోయారు. జార్ఖండ్‌లో 1,326 మంది ఆసుపత్రుల్లో చేరారు. చాలా చోట్ల, హీట్‌స్ట్రోక్ వార్డులన్నీ నిండిపోయాయి.
Heat Wave Effect: జూన్ 1న ఓటింగ్ కోసం పోలింగ్ పార్టీలను శుక్రవారం యూపీలోని మీర్జాపూర్‌కు పంపారు. ఈ మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా హోంగార్డులు, కానిస్టేబుళ్లు, పీఏసీ సిబ్బంది, పారామిలటరీ సిబ్బంది స్పృహతప్పి పడిపోయారు. పోలింగ్ బృందంతో పోలింగ్ కేంద్రానికి చేరుకున్న తర్వాత కొందరు స్పృహతప్పి పడిపోయారు.
14 రాష్ట్రాల్లో హీట్‌వేవ్ అలర్ట్..
Heat Wave Effect: IMD చెబుతున్నదాని ప్రకారం, శుక్రవారం కాన్పూర్‌లో దేశంలోనే అత్యధికంగా 48.2°C ఉష్ణోగ్రత నమోదైంది. హర్యానాలోని సిర్సా రెండవ స్థానంలో ఉండగా, ఇక్కడ టెంపరేచర్ 47.8°Cగా రికార్డ్ అయింది. ఢిల్లీలోని అయానగర్‌లో 47 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది.
రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, ఆంధ్రప్రదేశ్- హిమాచల్‌లలో శనివారం (జూన్ 1) హీట్‌వేవ్ అంచనా వేస్తున్నారు. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా మధ్య పగలు, రాత్రి వేళల్లో వేడి ఉంటుంది. తెలంగాణలో, గోవాలో వేడి తేమ ఉండే అవకాశం ఉంది.
వేడిగాలుల(Heat Wave Effect)ప్రభావం...
- ఒడిశా ప్రభుత్వం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఇళ్లలోనే ఉండాలని ప్రజలను కోరింది. ఇక్కడ 13 చోట్ల ఉష్ణోగ్రత 42 డిగ్రీల సెల్సియస్‌ను దాటింది. మరో మూడు రోజుల పాటు పరిస్థితి ఇలాగే ఉంటుందని భావిస్తున్నారు. కార్మికుల చేత ఎండలో ఎక్కువ పనులు చేయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం కాంట్రాక్టర్లను హెచ్చరించింది.
- మహారాష్ట్రలోని థానే మున్సిపల్ కార్పొరేషన్ నీటి సరఫరాలో 5 శాతం కోత ప్రకటించింది. కొత్త ఆర్డర్ జూన్ 5 నుండి అమలులోకి వస్తుంది. బీఎంసీ నుంచి నీటి సరఫరా తగ్గుతోందని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చెబుతున్నారు. నీటి కొరత కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. BMC నుండి థానే మున్సిపల్ కార్పొరేషన్‌కు 85 MLD నీరు సరఫరా అవుతుంది.
- సీజేఐ డీవై చంద్రచూడ్ సుప్రీంకోర్టు ఆవరణలో పక్షులకు నీరు, ఆహారంతో కూడిన కంటైనర్లను ఉంచారు. వాటిని ఉంచాల్సిన స్థలాలను సీజేఐ స్వయంగా నిర్ణయించారు. పక్షులకు నీరు, ఆహారం కొరత లేకుండా చూడడం కోసం ఆయన సూచనలు చేశారు.
- యూపీలోని అయోధ్యలోని రామాలయ నిర్వాహకులు ఇక్కడికి వచ్చే భక్తులకు వేడి నుంచి ఉపశమనం కలిగించేందుకు అనేక ఏర్పాట్లు చేశారు. భక్తుల కోసం సహాయ కేంద్రాలను తెరిచారు. నీటి కొరతను అధిగమించేందుకు పలు చోట్ల వాటర్ కూలర్లు ఏర్పాటు చేయడంతోపాటు ఓఆర్‌ఎస్‌కు ఏర్పాట్లు కూడా చేశారు. భక్తులు ఎక్కువ సేపు క్యూలో నిలబడకుండా ఉండేందుకే ఇలాంటి ఏర్పాట్లు చేస్తున్నామని నిర్వాహకులు చెబుతున్నారు.
రుతుపవనాలు..
Heat Wave Effect: నిర్ణీత సమయానికి 6 రోజుల ముందు రుతుపవనాలు పశ్చిమ బెంగాల్‌కు చేరుకున్నాయి. జూన్ 6 నాటికి రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయని అంతకు ముందు IMD అంచనా వేసింది. మే 26న పశ్చిమ బెంగాల్ - బంగ్లాదేశ్‌లను తాకిన రమాల్ తుఫాను రుతుపవనాలు ముందుగానే రావడానికి కారణం అని చెబుతున్నారు.
Heat Wave Effect: రాబోయే ఐదు రోజుల్లో ఉప హిమాలయ జిల్లాలైన కూచ్ బెహార్, జల్పాయిగురి, అలీపుర్‌దువార్, కాలింపాంగ్ మరియు డార్జిలింగ్‌లో వర్షాలు కురుస్తాయని, ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD అంచనా వేసింది. ఉత్తర బెంగాల్‌లో, రాష్ట్రంలో శుక్రవారం ఉదయం వర్షం పడిన ప్రదేశాలలో అలీపుర్‌దువార్ (45 మిమీ), జల్‌పైగురి (43 మిమీ) మరియు కూచ్ బెహార్ (28 మిమీ) ఉన్నాయి.
Also Read: ఎగ్జిట్ పోల్స్ వేళ కాంగ్రెస్ సంచలన నిర్ణయం
Heat Wave Effect: రానున్న మూడు రోజుల్లో కోల్‌కతా సహా దక్షిణ బెంగాల్‌లోని జిల్లాల్లో బలమైన గాలులు మరియు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. కోల్‌కతాలో 65 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ బెంగాల్ కంటే ముందు, రుతుపవనాలు మే 30న కేరళకు చేరుకున్నాయి. మే 31 నాటికి ఇది కేరళకు చేరుతుందని IMD అంచనా వేసింది. జూన్ 27 నాటికి ఢిల్లీకి చేరుకునే అవకాశం ఉంది.
అంతకుముందు మే 30, 2017న, మోరా తుఫాను కారణంగా రుతుపవనాలు షెడ్యూల్ కంటే ముందే వచ్చాయి. గతేడాది అంటే 2023లో కేరళలో రుతుపవనాలు ప్రవేశించడం ఏడు రోజుల ఆలస్యం తర్వాత జూన్ 8న జరిగింది. రుతుపవనాలు సాధారణంగా జూన్ 1న కేరళలోకి ప్రవేశిస్తాయి. జూన్ 5 నాటికి దేశంలోని చాలా ప్రాంతాలను కవర్ చేస్తాయి.