MLC Kavitha: లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు మరోసారి నిరాశే ఎదురైంది. తనకు అనారోగ్యం కారణంగా ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్ ఇవ్వాలని కోరుతూ కవిత దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను సుప్రీం కోర్టు వాయిదా వేసింది. ఈ కేసులో కవిత బెయిల్ కు వ్యతిరేకంగా సీబీఐ కౌంటర్ పిటిషన్ దాఖలు చేయగా.. ఈడీ చేయలేదు. తమకు కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం ఇవ్వాలని ధర్మాసనాన్ని కోరగా.. ఈడీ అభ్యర్థన మేరకు కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం ఇచ్చింది సుప్రీం కోర్టు. గురువారంలోపు కౌంటర్ దాఖలు చేయాలని ఈడీని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది.
పూర్తిగా చదవండి..BREAKING: కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా
కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా పడింది. తదుపరి విచారణ ఈ నెల 27న జరుపుతామని సుప్రీం కోర్టు తెలిపింది. ఈ కేసులో సీబీఐ కౌంటర్ దాఖలు చేయగా.. ఈడీ కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం ఇచ్చింది. గురువారంలోపు కౌంటర్ దాఖలు చేయాలని ఈడీకి ఆదేశాలు ఇచ్చింది.
Translate this News: