స్కిల్ స్కాం కేసులో (Skill Develompment case) టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (chandrababu naidu) బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో(Highcourt) విచారణ మరోసారి వాయిదా పడింది. కేసును ఈ నెల 15కు వాయిదా వేసింది. ప్రస్తుతం ఈ కేసులో చంద్రబాబు మధ్యంతర బెయిల్ పై బయటనే ఉన్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు రెగ్యులర్ బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారందరికీ న్యాయస్థానాలు బెయిల్ మంజూరు చేశాయి. ఈ కేసులో చంద్రబాబుకు మాత్రం బెయిల్ దక్కకపోవడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. స్కిల్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సుప్రీం కోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
Also read: నా అల్లుడిని కొట్టారు.. ఐటీ దాడులపై పొంగులేటి సంచలన ఆరోపణలు!
ఈ కేసులో వాదనలు విన్న సుప్రీం కోర్టు ధర్మాసనం తీర్పును రిజర్వ్ లో ఉంచిన విషయం తెలిసిందే. దీపావళి సెలవులు తరువాత తీర్పుని వెల్లడిస్తామని ఇప్పటికే సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మాసనం వెల్లడించింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు అనంతరం హైకోర్టు కూడా తీర్పు వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Also read: ఖతార్ లో నేవీ అధికారులకు మరణశిక్ష.. అప్పీల్ చేసిన భారత్!