Breaking స్కిల్‌ కేసులో చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా!

స్కిల్‌ డెవలప్ మెంట్‌ స్కాం కేసులో చంద్రబాబు బెయిల్‌ పిటిషన్ విచారణ వాయిదా పడింది. ఈ నెల 15కి వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు తెలిపింది.

New Update
Breaking స్కిల్‌ కేసులో చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా!

స్కిల్‌ స్కాం కేసులో (Skill Develompment case) టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (chandrababu naidu)  బెయిల్‌ పిటిషన్‌ పై హైకోర్టులో(Highcourt)  విచారణ మరోసారి వాయిదా పడింది. కేసును ఈ నెల 15కు వాయిదా వేసింది. ప్రస్తుతం ఈ కేసులో చంద్రబాబు మధ్యంతర బెయిల్‌ పై బయటనే ఉన్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు రెగ్యులర్‌ బెయిల్‌ కోసం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారందరికీ న్యాయస్థానాలు బెయిల్ మంజూరు చేశాయి. ఈ కేసులో చంద్రబాబుకు మాత్రం బెయిల్ దక్కకపోవడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. స్కిల్‌ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సుప్రీం కోర్టులో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

Also read: నా అల్లుడిని కొట్టారు.. ఐటీ దాడులపై పొంగులేటి సంచలన ఆరోపణలు!

ఈ కేసులో వాదనలు విన్న సుప్రీం కోర్టు ధర్మాసనం తీర్పును రిజర్వ్‌ లో ఉంచిన విషయం తెలిసిందే. దీపావళి సెలవులు తరువాత తీర్పుని వెల్లడిస్తామని ఇప్పటికే సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మాసనం వెల్లడించింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు అనంతరం హైకోర్టు కూడా తీర్పు వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Also read: ఖతార్‌ లో నేవీ అధికారులకు మరణశిక్ష.. అప్పీల్ చేసిన భారత్‌!

Advertisment
తాజా కథనాలు