చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ..వాదనలు వినిపిస్తున్న హరీశ్ సాల్వే..!!

టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో వాదనలు ప్రారంభం అయ్యాయి. చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు న్యాయవాది హరీష్ సాల్వే వాదనలు వినిపిస్తున్నారు.

New Update
Chandrababu Case Updates: చంద్రబాబుకు బిగ్ డే.. ఏసీబీ కోర్టు నుంచి సుప్రీం వరకు.. 6 తీర్పులు రేపే!

టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వాదనలు షురూ అయ్యాయి. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబను సీఐడీ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. విజయవాడలోని ఏసీబీ కోర్టు 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. అయితే ఏసీబీ కోర్టు జారీ చేసిన జ్యూడిషియల్ రిమాండ్ ఉత్తర్వులను సస్పెండ్ చేయాలని చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. గతవారం ఈ పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టింది. కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఇవాళ్టికి వాయిదా వేయడంతో ఇవాళణ వాదనలు ప్రారంభం అయ్యాయి.

ఇది కూడా చదవండి: ఫొటో సెషన్‎లో రాహుల్ ఏం చేశాడో తెలిస్తే షాక్ అవుతారు..!!

చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు న్యాయవాది హరీశ్ సాల్వే తన వాదనలను ప్రారంభించారు. హరీశ్ సాల్వే వర్చువల్ గా తన వాదనలు వినిపిస్తూ చంద్రబాబును అరెస్టు చేయడం చట్టవిరుద్దమన్నారు. కాగా అటు సీఐడీ తరపున సుప్రీంకోర్టు న్యాయవాది ముకుల్ రోహత్గ, ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించనున్నట్లు సమాచారం. అయితే ఈ పిటిషన్ పై కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న అంశంపై ఉత్కాంఠ నెలకొంది.

Advertisment
తాజా కథనాలు