Hormonal Health: ఈ అలవాట్లతో.. హార్మోనల్ సమస్యలకు చెక్ పెట్టండి

శరీరంలో హార్మోనల్ బ్యాలెన్స్ కోసం ఈ ఆరోగ్యకరమైన అలవాట్లు పాటించండి. శారీరక వ్యాయామాలు, ప్రోటీన్ రిచ్ ఫుడ్, మెగ్నీషియం ఫుడ్స్, ఫెర్మెంటేడ్ ఫుడ్స్ తీసుకోవడం హార్మోన్ సమతుల్యతలకు సహాయపడతాయి.

New Update
Hormonal Health: ఈ అలవాట్లతో.. హార్మోనల్ సమస్యలకు చెక్ పెట్టండి

Hormonal Health :  అనారోగ్యమైన ఫుడ్ హ్యాబిట్స్, జీవన శైలి(Life Style) విధానాలు శరీరంలో హార్మోన్ అసమతుల్యతలకు కారణమవుతాయి. హార్మోనల్ ఇంబ్యాలెన్స్(Hormonal Imbalances).. పీరియడ్స్ సమస్యలు(Periods Problems), అవాంఛిత రోమాలు పెరగడం, సంతానోత్పత్తి కష్టాలు, బరువు పెరగడం, నిద్రలేమి వంటి సమస్యలను కలిగిస్తాయి. ఈ ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు పాటించడం.. హార్మోన్ సమతుల్యతలను నిర్వహించడంలో మంచి ప్రభావం చూపుతాయి. అలాగే తద్వారా వచ్చే సమస్యలను కూడా తగ్గిస్తుంది.

Also Read : Makeup Essentials : అమ్మాయిలు బయటకు వెళ్ళేటప్పుడు.. క్యారీ చేయాల్సిన ఐదు మేకప్ ఎసెన్షియల్స్

సూర్యరష్మీ

రోజు ఉదయాన్నే నిద్ర లేవగానే 15-30 నిమిషాల పాటు సూర్యరశ్మిలో ఉండాలి. ఇది మానసిక స్థితిని బ్యాలెన్స్ చేయడానికి అవసరమయ్యే.. సెరటినిన్ హార్మోన్ ఉత్పత్తిని పెంపొందిస్తుంది. అలాగే విటమిన్ D పెరుగుదలకు సహాయపడుతుంది.

ప్రోటీన్ రిచ్ ఫుడ్

హార్మోన్ సమతుల్యతకు ప్రోటీన్(Protein) ఎక్కువగా లభించే ఆహారాలు తీసుకోవడం చాలా ముఖ్యం. ప్రోటీన్ లో హార్మోన్ల ఉత్పత్తికి అవసరమైన అమైనో యాసిడ్స్ ఉంటాయి. ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ , టెస్టోస్టెరాన్ వంటి హార్మోన్ల ఉత్పత్తికి పుష్కలమైన ప్రోటీన్ తీసుకోవడం తప్పనిసరి. ఇవి మానసిక స్థితి, రీప్రొడక్టివ్ హెల్త్ నిర్వహించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

Protein Foods - Walking - Sun Rises

మినరల్ ఇన్ఫ్యూజ్డ్ వాటర్

మినరల్ వాటర్(Mineral Water) లో జింక్, మెగ్నీషియం, సెలీనియం, క్యాల్షియం వంటి ఆరోగ్యకరమైన మినరల్స్ ఉంటాయి. ఇవి హార్మోన్ సమతుల్యతను నిర్వహించడంలో సహాయపడతాయి. ఈ మినరల్స్ సంతానోత్పత్తి, థైరాయిడ్ పనితీరు, అడ్రినల్ ఆరోగ్య సమస్యల పై మంచి ప్రభావం చూపుతాయి.

ఫెర్మెంటేడ్ ఫుడ్స్

ఫెర్మెంటేడ్ ఫుడ్స్(Fermented Foods) ఆరోగ్యకరమైన గట్ మైక్రోబయోమ్ ప్రోత్సహిస్తాయి. మైక్రోబయోమ్ హార్మోన్ సమతుల్యతకు సహాయపడుతుంది. ముఖ్యంగా ఇది శరీరంలోని టెస్టోస్టెరాన్ స్థాయిలను నిర్వహించడంలో తోడ్పడుతుంది.

మెగ్నీషియం రిచ్ ఫుడ్స్

నిద్రలేమి , ఆందోళన, ఒత్తిడి, మానసిక కల్లోలం, చికాకు వంటి సమస్యలు శరీరంలో హార్మోన్ ఉత్పత్తుల పై ప్రభావం చూపుతాయి. మెగ్నీషియం రిచ్ ఫుడ్స్ ఈ సమస్యల నుంచి ఉపశమనం కలిగించి.. హార్మోన్ సమతుల్యతలకు సహాయపడతాయి.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Also Read : Grey Hair Tips: జుట్టు నల్లగా మారాలంటే నల్ల జీలకర్ర ఫ్యాక్స్ ట్రై చేయండి

Advertisment
తాజా కథనాలు