skin care: స్కిన్ కేర్ కోసం ఈ పండు తినండి..!

ఉసిరిని సూపర్ ఫుడ్‌గా నిపుణులు చెబుతున్నారు.ఉసిరిలో శరీరానికి అవసరమైన విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయి. అందుకే దీన్ని సూపర్ ఫుడ్‌గా పేర్కొంటారు. అయితే వీటిలోని సమ్మేళనాలు జట్టు పెరుగుదలను, చర్మ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి. ఉసిరి హెల్త్ బెనిఫిట్స్, వీటిని ఎలా వాడాలో తెలుసుకుందాం.

New Update
skin care: స్కిన్ కేర్ కోసం ఈ పండు తినండి..!

ఇండియన్ గూస్‌బెర్రీగా పిలిచే ఉసిరి భారత్‌లోని అన్ని ప్రాంతాల్లోనూ పండుతుంది. వీటితో వివిధ రకాల వంటలు తయారు చేసుకోవచ్చు. ఉసిరిలో ఔషధ గుణాలు, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే ఆయుర్వేద వైద్యంలో కూడా వీటిని వాడుతున్నారు. ఉసిరిలో శరీరానికి అవసరమైన విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయి. అందుకే దీన్ని సూపర్ ఫుడ్‌గా పేర్కొంటారు. అయితే వీటిలోని సమ్మేళనాలు జట్టు పెరుగుదలను, చర్మ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఉసిరి హెల్త్ బెనిఫిట్స్, వీటిని ఎలా వాడాలో తెలుసుకుందాం.

ఉసిరి సిట్రస్ వర్గానికి చెందినది. ఇందులో సిట్రిక్ యాసిడ్, విటమిన్- సి ఉంటుంది. ఇవి శరీర రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. వివిధ సీజన్లలో వచ్చే అంటు వ్యాధులను నిరోధిస్తాయి, శరీరానికి శక్తిని ఇస్తాయి.ఉసిరి పలుకులు తింటే పొట్ట ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీంతో మలబద్ధకం, కడుపు ఉబ్బరం, అజీర్తి వంటి జీర్ణసమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఫలితంగా జీర్ణవ్యవస్థ ఆరోగ్యకరంగా ఉంటుంది.ఉసిరిలో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి శరీర కణాలను బలోపేతం చేస్తాయి. తద్వారా చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపర్చుతాయి. మృదువైన, మెరిసే ఛాయను ప్రోత్సహిస్తాయి.

ఉసిరి షుగర్ పేషెంట్స్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఎదుకంటే రక్తంలో షుగర్ లెవల్స్ నియంత్రించే సమ్మేళనాలు దీంట్లో ఉంటాయి.ఉసిరిలోని సమ్మేళనాలు కుదుళ్లకు పోషణ ఇచ్చి, జుట్టు ఆరోగ్యంగా పెరిగేలా ప్రోత్సహిస్తాయి. అలాగే జుట్టును మెరిసేలా చేస్తాయి.తాజా ఉసిరికాయల నుంచి రసం తీయాలి. దీంట్లో కొంచెం వాటర్, రుచికోసం కొద్దిగా తేనె లేదా బెల్లం కలిపి పరగడుపున తాగాలి. దీంతో బాడీ డిటాక్సిఫై అవుతుంది, ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రావు.పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, మసాలాలతో ఉసిరికాయను గ్రైండ్ చేసుకుని ఇన్‌స్టంట్ చట్నీ తయారుచేసుకోవచ్చు. అన్నంలో దీని టేస్ట్‌ ఆస్వాదించవచ్చు.

ఉసిరికాయను ముక్కలుగా కట్ చేసుకోవాలి. వాటిని పంచదార పాకంలో వేసి నానబెట్టాలి. ఆ తరువాత ఎండబెట్టాలి. దీంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన ఉసిరి మిఠాయిలు రెడీ. వీటిని చిరుతిండిగా తినొచ్చు.చాలా మంది ఉసిరితో ఊరగాయ, పచ్చళ్లు తయారుచేస్తారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉసిరి ఊరగాయ రెడీ చేస్తారు. దీని టేస్ట్ సూపర్‌గా ఉంటుంది.ఉసిరిని పొడి చేసి వాడొచ్చు. ముందుగా ఉసిరి ముక్కలను పొడి చేసి మెత్తగా రుబ్బుకోవాలి. తగినంత కారం, ఇతర మసాలను జోడించి పోపు చేయాలి. తాజా ఉసిరికాయల తురుమును వివిధ రకాల సలాడ్‌లకు యాడ్ చేసుకోవచ్చు. స్మూతీల్లో ఉసిరి రసం లేదా పొడి చల్లుకుంటే కొత్త టేస్ట్‌ వస్తుంది, పోషకాలు సైతం అందుతాయి. కూరల రుచి, పోషక విలువలను పెంచడానికి ఉసిరి ముక్కలను మిక్స్ చేసుకోవచ్చు.

Advertisment
తాజా కథనాలు