Health Tips: గర్భసంచి తొలగింపు తర్వాత ఏ జాగ్రత్తలు తీసుకోవాలి..?

గర్భాశయ శస్త్రచికిత్స తర్వాత ఆరోగ్యకర ఆహారంతో పాటు పలు జాగ్రత్తలు తీసుకోవాలి. కుట్టు తొలగించిన తర్వాత శుభ్రంగా ఉంచుకోవాలి. ఆ ప్రాంతంలో తడిగా ఉండకుండా చూసుకోవాలి. ఆహారంతో పాటు తగిన విశ్రాంతి తీసుకోవాలి. కనీసం 8గంటలు నిద్రపోవాలి. ప్రతిరోజు ధ్యానం, యోగా చేయాలి.

Health Tips: గర్భసంచి తొలగింపు తర్వాత ఏ జాగ్రత్తలు తీసుకోవాలి..?
New Update

Health Tips: గర్భాశయాన్ని తొలగించిన తర్వాత శరీరం సాధారణ స్థితికి రావడానికి కొన్ని వారాల సమయం పడుతుంది. గర్భాశయ శస్త్రచికిత్స తర్వాత ఆరోగ్యకర ఆహారంతో పాటు పలు జాగ్రత్తలు తీసుకోవాలి. నాలుగు నుంచి ఎనిమిది వారాల్లో మీరు సాధారణ స్థితికి చేరుకున్నా సరే గర్భసంచి తొలగింపు తర్వాత నిద్రలేమి, చిరాకు, హార్మోన్ల మార్పులతో బరువు పెరగడం జరుగుతూ ఉంటుంది.

గర్భాశయ శస్త్రచికిత్స:

  • ట్రాన్స్‌వాజినల్ హిస్టెరెక్టమీ అనే ప్రక్రియ యోనిలో కోత విధిస్తారు. ఆ తర్వాత గర్భాశయం తొలగిస్తారు. పొత్తి కడుపులో చాలా చిన్న కోతల ద్వారా చిన్న కెమెరాతో ఒక సన్నని వెలుగుతో కూడిన ట్యూబ్ కడుపులోకి పంపించి ఆపరేషన్‌ పూర్తి చేస్తారు.

ఆపరేషన్‌ తర్వాత కుట్లను ఎలా కాపాడుకోవాలి?:

  • హిస్టెరెక్టమీ ప్రక్రియతో సంబంధం లేకుండా కుట్లు ఎప్పుడూ శుభ్రంగా, పొడిగా ఉండాలి. కుట్టు తొలగించిన తర్వాత శుభ్రంగా ఉంచుకోవాలి. ఆ ప్రాంతంలో తడిగా ఉండకుండా చూసుకోవాలి. కుట్లు వేసిన ప్రదేశంలో ఏదైనా ఎరుపు రంగులో గాయం కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి.

ఇవి చేయవద్దు:

  • స్వీయ వైద్యం పనికిరాదు, కుట్లు తగ్గే వరకు బిగుతుగా ఉండే దుస్తులు ధరించవద్దు. దురదగా ఉంటే ఆ ప్రాంతాన్ని రుద్దకండి.

ఎలాంటి ఆహారం తీసుకోవాలి:

  • మీ ఆహారంలో సీజనల్‌ పండ్లను తీసుకోవాలి. కూరగాయలతోపాటు ఫైబర్, హైడ్రేషన్ పెంచే ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు.

తినకూడని పదార్థాలు:

  • పండ్ల రసాలను తీసుకోకూడదు, కొవ్వు పదార్థాలకు దూరంగా ఉండాలి, ఎక్కువ మసాలాలు తినొద్దు, ఆయిల్ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి.
    ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ అస్సలు ముట్టుకోవద్దు.

జీవనశైలి ఎలా ఉండాలి?:

  • ఆహారంతో పాటు తగిన విశ్రాంతి తీసుకోవాలి. కనీసం ఎనిమిది గంటలు నిద్రపోవాలి. ప్రతిరోజు ధ్యానం, యోగా చేయాలి, ఇలా చేయడం వల్ల చురుకుగా ఉంటారు. మరో విషయం ఏంటంటే బరువులు అస్సలు ఎత్తకూడదు. శస్త్రచికిత్స తర్వాత బరువులు ఎత్తడం వల్ల కుట్ల మీద ఒత్తిడి పడుతుంది. అంతేకాకుండా హెర్నియా వచ్చే అవకాశాలు ఉంటాయి. నిద్రపోతున్నప్పుడు స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించవద్దు. టీవీ చూడవద్దు. ఇవి నిద్రపై ప్రభావం చూపుతాయి. నిద్రపోయే ముందు టీ లేదా కాఫీ తాగడం మానుకోవాలి.

ఇది కూడా చదవండి: కోపం వైవాహిక జీవితంలో చిచ్చు పెడుతుందా?..ఇలా తగ్గించుకోండి

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

#health-tips #uterus
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe