Health Tips: నిమ్మకాయ అంత మంచిదేమీ కాదు.. చాలా ప్రమాదాలు ఉంటాయ్!

నిమ్మకాయ ఎక్కువగా వాడడం మంచిది కాదంటున్నారు నిపుణులు. నిమ్మకాయలలోని యాసిడ్ పంటికి మంచిది కాదు. అందుకే నేరుగా తినకూడదు. నిమ్మకాయ రసాన్ని తాగిన తర్వాత మీ నోటిని ఫ్లష్‌ చేసుకోండి. నేరుగా నిమ్మను చర్మంపై అప్లై చేసుకోకుడు. కొంతమందికి సిట్రస్ పండ్లకు అలెర్జీ ఉండవచ్చు.

New Update
Health Tips: నిమ్మకాయ అంత మంచిదేమీ కాదు.. చాలా ప్రమాదాలు ఉంటాయ్!

How Lemon effects Human Health: నిమ్మకాయతో అనేక ప్రయోజనాలు ఉంటాయన్న విషయం అందరికి తెలిసిందే. నిమ్మకాయను మన నిత్యజీవితంలో భాగం చేసుకున్నాం. నిమ్మకాయని యూజ్ చేసుకోని అనేక పనులు చేస్తుంటాం. నిమ్మరసం తాగడం దగ్గర నుంచి నమ్మతొక్కతో గెన్నెలు క్లీన్ చేసే వరకు ప్రతీది ఈ పండుపై ఆధారపడుతుంటాం. నిమ్మకాయను మితంగా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. కానీ అధికంగా తీసుకోవడం వల్ల ప్రతికూల ప్రభావాలు కూడా ఉంటాయి. వాటిపై ఒక లుక్కేయండి.

నిమ్మకాయతో ప్రయోజనాలు:

విటమిన్ సీ: నిమ్మకాయలలో విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది. ఇది మనల్ని ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. నిమ్మకాయతో రోగనిరోధక వ్యవస్థ కూడా మెరుగుపడుతుంది.

యాంటీఆక్సిడెంట్లు: నిమ్మకాయలు యాంటీఆక్సిడెంట్లు కలిగి ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి సహాయపడతాయి.

హైడ్రేషన్: నిమ్మకాయ రసంతో అనేక ప్రయోజనాలు ఉంటాయి. ఇది మనల్ని రీఫ్రెష్ చేస్తుంది. ఎవరైనా చాలా సేపు తిండి లేకుండా ఉంటే వారికి నిమ్మరసం ఇస్తారు. ఎందుకంటే ఇది కళ్లుతిరగకుండా చేస్తుంది. రాజకీయ నాయకులు నిరాహార దీక్షలు చేసిన తర్వాత ఆ దీక్షను విరమించే సమయంలో నిమ్మకాయ రసాన్ని ఇస్తారు.

జీర్ణక్రియ: నిమ్మకాయ నీరు జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఇది ఉబ్బరం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అందుకే నాన్‌ వేజ్‌లో కొందరు నిమ్మకాయను పిండుకుంటారు. దీని వల్ల త్వరగా అరుగుతుందని చెబుతుంటారు.

బరువు: నిమ్మకాయలలోని పెక్టిన్ ఫైబర్ ఆకలిని కాస్త తగ్గిస్తుంది. అంటే కాస్త లైట్‌గా తినేలా చేస్తుంది. అంటే మనకు తెలియకుండా మన బరువును పెరగనివ్వకుండా ఇది హెల్ప్ చేస్తుంది.

నిమ్మకాయతో నెగిటివ్‌ ఎఫెక్ట్స్:

టీత్‌: నిమ్మకాయలలోని యాసిడ్ టీత్‌(పంటి)కి మంచిది కాదు. నిమ్మకాయను చాలా మంది నేరుగా తింటుంటారు. ఇది అసలు మంచిది కాదని దంత వైద్యులు చెబుతున్నారు. నిమ్మకాయల్లో ఉండే యాసిడ్‌ పంటికి ఉండే ఎనామిల్‌ను పాడుచేస్తుంది. నిమ్మకాయ రసాన్ని తాగిన తర్వాత మీ నోటిని ఫ్లష్‌ చేసుకోండి.

ఆరోగ్య సమస్యలు: అధికంగా నిమ్మకాయ తీసుకోవడం యాసిడ్ రిఫ్లక్స్‌కు కారణం. దీని వల్ల జీర్ణ సమస్యలను పెరుగుతాయి. మితంగా తీసుకుంటే జీర్ణనానికి మంచిది... అధికంగా తీసుకుంటే జీర్ణనానికి మంచిది కాదని గుర్తుపెట్టుకోండి

సిట్రస్ అలర్జీలు: కొంతమందికి సిట్రస్ పండ్లకు అలెర్జీ ఉండవచ్చు. దీని వల్ల కూడా ఆరోగ్య సమస్యలు వస్తాయి.

స్కిన్ సెన్సిటివిటీ: కొంతమంది నిమ్మను మెరిసే చర్మం కోసం లేదా చర్మ సమస్యల నివారణకు ఉపయోగిస్తారు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నిమ్మకాయ ఒక యాసిడ్‌. దీని pH వ్యాల్యూ 7 కంటే తక్కువగా ఉంటుంది. నేరుగా నిమ్మను చర్మంపై అప్లై చేసుకోకుడు. ఏదైనా కలుపుకొని చేసుకోవచ్చు.. అయితే ఇలాంటివి చేసే ముందు కచ్చితంగా స్కిన్‌ డాక్టర్‌ని సంప్రదించడం మంచిది.

Also Read: నాలుగు మ్యాచ్‌లు పక్కన పెట్టారు.. కసితీరా బౌలింగ్‌ చేసి అందరి నోళ్లు మూయించాడు!

Advertisment
తాజా కథనాలు