Health tips: డిన్నర్‌ తర్వాత ఇలా చేయండి.. హ్యాపీగా నిద్రపోతారు!

భోజనం తర్వాత 20-30 నిమిషాలు వాకింగ్ చేయడం వల్ల శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యానికి కూడా సహాయపడుతుంది. ఇలా చేయడం వల్ల అజీర్ణత, బరువు పెరగడం, నిద్ర లేమి, ఒత్తిడి వంటి సమస్య కూడా దూరమవుతాయి.

Health tips: డిన్నర్‌ తర్వాత ఇలా చేయండి.. హ్యాపీగా నిద్రపోతారు!
New Update

చాలా మంది భోజనం తర్వాత కాసేపు అలానే కూర్చోవడం లేదా బెడ్ పై పడుకోవడం చేస్తుంటారు. కానీ ఇలా అస్సలు చేయకూడదు. భోజనం చేశాక కనీసం 20-30 నిమిషాల వరకు మెల్లిగా వాకింగ్ చేయడం వల్ల జీర్ణక్రియతో పాటు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అంతే కాదు దీని వల్ల మానసిక, శారీరక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.

భోజనం తర్వాత వాకింగ్ చేస్తే కలిగే లాభాలు:

జీర్ణక్రియ మెరుగుపడుతుంది :

తిన్న తర్వాత కొద్దిసేపు వాకింగ్ చేయడం వల్ల జీర్ణక్రియ పై మంచి ప్రభావం చూపుతుంది. అంతే కాదు అజీర్ణత, కడుపుబ్బరం, వంటి జీర్ణ సమస్యలు తగ్గుతాయి. ముఖ్యంగా గ్యాస్ట్రిక్ సమస్య ఉన్న వాళ్లకు ఇది చాలా ఉపయోగపడుతుంది.

బరువు తగ్గడంలో సహాయం :

భోజనం తర్వాత వాకింగ్ చేయడం వల్ల శరీరంలోని అధిక కేలరీలు కొవ్వు రూపంలో నిల్వ ఉండకుండా వాటిని కరిగించడానికి సహాయపడుతుంది. దాని వల్ల అధిక బరువు సమస్య తగ్గుతుంది.

ఒత్తిడిని తగ్గిస్తుంది :

అంతే కాదు ఇలా చేయడం వల్ల శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. రోజు ఒక అరగంట సేపు వాక్ చేయడం వల్ల ఒత్తిడి కూడా తగ్గి మనసు ప్రశాంతంగా ఉంటుంది.

మంచి నిద్రను అందిస్తుంది:

తిన్న తర్వాత కాసేపు వాకింగ్ చేస్తే నిద్ర నాణ్యత కూడా పెరుగుతుంది. అలాగే త్వరగా నిద్రపోవడానికి సహాయపడుతుంది. శారీరక శ్రమ చేయడం వల్ల నిద్రలేమి సమస్య కూడా దూరమవుతుంది.

నిద్రమత్తును తొలగిస్తుంది :

చాలా మందికి తిన్న తర్వాత మగతగా, నిద్రమత్తుగా అనిపిస్తుంది. ఇలా వాకింగ్ చేయడం వల్ల నిద్రమత్తు పోయి యాక్టిివ్ గా ఉంటారు. అలాగే మనం చేసే పని పై కూడా శ్రద్ధ పెట్టగలం.

Also Read: Pink Lips: మనసులను లాక్‌ చేసే లిప్స్‌.. లేలేత అధరాల కోసం ఈ టిప్స్‌ ఫాలో అవ్వండి! - Rtvlive.com

#health-tips #sleep-tips
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe