Health tips: డిన్నర్ తర్వాత ఇలా చేయండి.. హ్యాపీగా నిద్రపోతారు! భోజనం తర్వాత 20-30 నిమిషాలు వాకింగ్ చేయడం వల్ల శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యానికి కూడా సహాయపడుతుంది. ఇలా చేయడం వల్ల అజీర్ణత, బరువు పెరగడం, నిద్ర లేమి, ఒత్తిడి వంటి సమస్య కూడా దూరమవుతాయి. By Archana 04 Nov 2023 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి చాలా మంది భోజనం తర్వాత కాసేపు అలానే కూర్చోవడం లేదా బెడ్ పై పడుకోవడం చేస్తుంటారు. కానీ ఇలా అస్సలు చేయకూడదు. భోజనం చేశాక కనీసం 20-30 నిమిషాల వరకు మెల్లిగా వాకింగ్ చేయడం వల్ల జీర్ణక్రియతో పాటు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అంతే కాదు దీని వల్ల మానసిక, శారీరక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. భోజనం తర్వాత వాకింగ్ చేస్తే కలిగే లాభాలు: జీర్ణక్రియ మెరుగుపడుతుంది : తిన్న తర్వాత కొద్దిసేపు వాకింగ్ చేయడం వల్ల జీర్ణక్రియ పై మంచి ప్రభావం చూపుతుంది. అంతే కాదు అజీర్ణత, కడుపుబ్బరం, వంటి జీర్ణ సమస్యలు తగ్గుతాయి. ముఖ్యంగా గ్యాస్ట్రిక్ సమస్య ఉన్న వాళ్లకు ఇది చాలా ఉపయోగపడుతుంది. బరువు తగ్గడంలో సహాయం : భోజనం తర్వాత వాకింగ్ చేయడం వల్ల శరీరంలోని అధిక కేలరీలు కొవ్వు రూపంలో నిల్వ ఉండకుండా వాటిని కరిగించడానికి సహాయపడుతుంది. దాని వల్ల అధిక బరువు సమస్య తగ్గుతుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది : అంతే కాదు ఇలా చేయడం వల్ల శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. రోజు ఒక అరగంట సేపు వాక్ చేయడం వల్ల ఒత్తిడి కూడా తగ్గి మనసు ప్రశాంతంగా ఉంటుంది. మంచి నిద్రను అందిస్తుంది: తిన్న తర్వాత కాసేపు వాకింగ్ చేస్తే నిద్ర నాణ్యత కూడా పెరుగుతుంది. అలాగే త్వరగా నిద్రపోవడానికి సహాయపడుతుంది. శారీరక శ్రమ చేయడం వల్ల నిద్రలేమి సమస్య కూడా దూరమవుతుంది. నిద్రమత్తును తొలగిస్తుంది : చాలా మందికి తిన్న తర్వాత మగతగా, నిద్రమత్తుగా అనిపిస్తుంది. ఇలా వాకింగ్ చేయడం వల్ల నిద్రమత్తు పోయి యాక్టిివ్ గా ఉంటారు. అలాగే మనం చేసే పని పై కూడా శ్రద్ధ పెట్టగలం. Also Read: Pink Lips: మనసులను లాక్ చేసే లిప్స్.. లేలేత అధరాల కోసం ఈ టిప్స్ ఫాలో అవ్వండి! - Rtvlive.com #sleep-tips #health-tips మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి