వాటర్ తాగడం అన్నిటికంటే ముఖ్యం. మంచినీళ్లు తాగకుండా మనిషి ఎక్కువ కాలం బతకలేడు. మన శరీరానికి వాటర్ ఎంతో అవసరం. లోపల శరీరాన్ని వాటర్ క్లీన్ చేస్తుంది. మన బాడీలో ఏ ఆర్గన్ మంచిగా పనిచేయలన్నా మంచినీరు అవసరం. చాలా ఆరోగ్య సమస్యలకు మంచినీరు చెక్ పెడుతోంది. అందుకే డాక్టర్లు సైతం డైలీ వాటర్ ఎంత తాగాలో చెబుతుంటారు. ఉదయం లెవగానే గ్లాసు మంచినీళ్లతో రోజును ప్రారంభించాలన్నది చాలా మంది చెప్పే పాయింట్. అయితే రాత్రి పడుకునే సమయంలో మాత్రం వాటర్ తాగడం.. తాగకపోవడంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.
నిద్రసమయానికి ముందు వాటర్ తాగడం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవు. అయితే తాగకూడదని చెప్పడం వెనుక బలైమన కారణం ఉంది. బెడ్ టైమ్‌కి ముందు మంచినీరు తాగితే అది యూరిన్‌కు కారణం అవుతుంది. నిద్రపోయిన తర్వాత యూరిన్ వస్తే అది స్లీప్‌ని పాడుచేస్తుంది. రాత్రిసమయంలో పదేపదే బాత్‌రూమ్‌కి వెళ్లడం వల్ల నిద్ర చెడిపోతుంది. కొంతమందికి ఇలా నిద్రలెగడం వల్ల మళ్లీ నిద్రపట్టకపోవచ్చు. అయితే నిద్రకు ముందు వాటర్ తాగడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అవేంటో తెలుసుకోండి.
పడుకునే ముందు నీరు తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి:
హైడ్రేషన్: హైడ్రేషన్ స్థాయిలను నిర్వహించడంలో సహాయపడుతుంది. మొత్తం శారీరక విధులకు మద్దతు ఇస్తుంది.
జీర్ణక్రియ: మలబద్ధకాన్ని నివారించడంతో పాటు ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థను ప్రోత్సహిస్తుంది. జీర్ణక్రియలో సహాయపడుతుంది.
ఉష్ణోగ్రత నియంత్రణ: శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా రాత్రి వేడిగా ఉంటే వాటర్ తాగి పడుకుంటే కాస్త చల్లగా అనిపిస్తుంది.
జాయింట్ లూబ్రికేషన్: కీళ్లకు లూబ్రికేషన్ అందించడం ద్వారా కీళ్ల ఆరోగ్యానికి తోడ్పడుతుంది.
చర్మ ఆరోగ్యం: హైడ్రేషన్ చర్మ ఆరోగ్యానికి తోడ్పడుతుంది. పొడి స్కిన్‌ని తగ్గిస్తుంది. మరింత శక్తివంతమైన ఛాయను ప్రోత్సహిస్తుంది.
కిడ్నీ ఫంక్షన్: వ్యర్థాలు, టాక్సిన్‌ల తొలగింపులో సహాయం చేయడం ద్వారా మూత్రపిండాల పనితీరుకు మద్దతు ఇస్తుంది.
అయితే గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే.. ఒకవేళ నిద్రకు ముందు వాటర్ తాగాలని డిసైడ్ అయినా అది మితంగా ఉండేలా చూసుకోండి. ఎక్కువ వాటర్ తాగి పడుకుంటే ఎక్కువగా బాత్‌రూమ్‌కి వెళ్లాల్సి వస్తుంది.
DISCLAIMER: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. RTV దీనిని ధృవీకరించలేదు.
Also Read: వ్యాయామం చేసేవారు కచ్చితంగా ఇది తెలుసుకోవాలి.. లేకపోతే ఆ ప్రాబ్లెమ్ తప్పదు!