ప్రపంచమంతా ప్లాస్టిక్‌మయంగా మారింది. ఏ వస్తువు చూసినా ప్లాస్టిక్‌తోనే తయారు చేసి ఉంటుంది. ప్లాస్టిక్ భూతంలాంటిదని పర్యావరణవేత్తలు మొత్తుకుంటున్నా వీటి ఉత్పత్ది ఆగడంలేదు. చాలా చోట్ల ప్లాస్టిక్ వస్తువుల వాడకాన్ని బ్యాన్ చేసినా అది అమల్లో మాత్రం కనిపించడంలేదు. ఎందుకుంటే ప్రజలు వీటికి బాగా అలవాటు పడిపోయారు. క్యారియింగ్‌కి ప్లాస్టిక్‌తో తయారు చేసిన మెటీరియల్స్ బెస్ట్ అని ఫిక్స్ ఐపోయారు. ఇది నిజమే కానీ అధికంగా ప్లాస్టిక్ యూజ్ చేయడం మనకు అంతమంచిది కాదు. ముఖ్యంగా వాటర్ బాటిల్స్ విషయంలో జాగ్రత్త అవసరం. చిన్నారుల నుంచి వృద్ధుల వరుకు చాలా మంది ప్లాస్టిక్ బాటిల్స్‌లోనే వాటర్ తాగుతుంటారు. అందుకే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి.
BPA: కొన్ని ప్లాస్టిక్ బాటిల్స్ BPA(బిస్ఫినాల్-A)ను కలిగి ఉంటాయి. బాటిల్స్ వేడి లేదా సూర్యరశ్మికి గురైనప్పుడు ఈ బీపీఏ నీటిలోకి కలుస్తుంది. బీపీఏ ఎక్స్‌పోజర్‌తో కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయి. అందుకే ప్లాస్టిక్ బాటిల్స్ కొనేటప్పుడు అవి బీపీఏ-రహితంగా లేబుల్ చేసి ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. మార్కెట్‌లో ఇప్పుడు చాలా కంపెనీలు తమ బాటిల్స్‌లో బీపీఏ లేదని ప్రకటించుకుంటున్నాయి.
పర్యావరణం: సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బాటిల్స్ పర్యావరణానికి మంచిది కాదు. కేవలం మన స్వార్థమే చూసుకోవడం కరెక్ట్ కాదు. మనిషి ఇలా స్వార్థంగా ఉన్నాడు కాబట్టే ప్రకృతి నాశనం అవుతుంది. ప్లాస్టిక్ బాటిల్స్ హాని కలిగించే వ్యర్థాలను కలిగి ఉంటాయి. అందుకే రీయూజ్ బాటిళ్లను ఉపయోగించండి. లేదా ప్లాస్టిక్ బాటిళ్లను రీసైక్లింగ్ చేయడం వల్ల పర్యావరణంపై నెగిటివ్ ప్రభావాన్ని తగ్గించవచ్చు.
నాణ్యత: కొన్ని సార్లు ప్లాస్టిక్ బాటిల్స్ నుంచి నీరు తాగేటప్పుడు వాటి నుంచి డిఫరెంట్ వాసన లేదా టెస్ట్ అనిపిస్తుంది. ఇది నాణ్యత లేని బాటిల్స్ నుంచి వస్తుంది. అలాంటి బాటిల్స్‌కు దూరంగా ఉండండి.
వాష్: మీరు ఉపయోగించే ప్లాస్టిక్ బాటిల్స్ ఫుడ్ గ్రేడ్ అండ్ హానికరమైన రసాయనాలు లేనివిగా ఉండేలా చూసుకోండి. బ్యాక్టీరియా పెరుగుదలను నివారించడానికి బాటిళ్లను క్రమం తప్పకుండా కడగండి.
అటు మైక్రోప్లాస్టిక్ బాటిల్స్ వల్ల కలిగే దీర్ఘకాలిక ఆరోగ్య ప్రభావాలపై రీసెర్చ్‌లు ఇంకా జరుగుతున్నాయి. ఏది ఏమైనా ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది.
Also Read: Nails: చేతి గోళ్లు పెంచుకుంటున్నారా? ఏం జరుగుతుందో తెలిస్తే మళ్లీ ఆ పని చేయరు! - Rtvlive.com