Eye Care: కళ్లు నొప్పి పెడుతున్నాయా? ఈ చిన్న చిట్కాతో మీ పెయిన్ ఫసక్..! కళ్లు అదే పనిగా నొప్పి పెడుతుంటే వైద్య నిపుణుడిని సంప్రదించడం ముఖ్యం. అయితే తగినంత నిద్ర, స్క్రీన్ ముందు ఉన్నప్పుడు కంప్యూటర్ గ్లాసెస్ వాడడం, మంచినీళ్లు తాగుతూ హైడ్రెటెడ్‌గా ఉండడం, స్క్రీన్ ముందు ఎక్కువ సమయం గడుపుతున్నట్టు అయితే మధ్యమధ్యలో గ్యాప్ తీసుకోవడం లాంటి టిప్స్‌తో పెయిన్ కాస్త తగ్గించుకోవచ్చు. By Trinath 16 Oct 2023 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి కళ్లు(Eyes) చాలా సెన్సిటివ్.. చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. కళ్లతోనే మనం ప్రపంచాన్ని చూడగలుగుతున్నాం. కంటి ఆరోగ్యం అన్నిటికంటే ముఖ్యం. అయితే మారుతున్న లైఫ్‌స్టైల్‌తో కళ్ల సమస్యలు బాగా పెరుగుతున్నాయి. చిన్నతనంలోలే చాలా మందికి విజన్ ప్రాబ్లెమ్ వచ్చి స్పెట్స్ పెట్టుకోవాల్సి వస్తోంది. ఇక కంప్యూటర్ల(Computers) ముందు ఎక్కువగా జాబ్ చేసే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. అదే పనిగా స్క్రీన్ ముందే గడపడం వల్ల అనేక కంటి సమస్యలు వస్తున్నాయి. అందులో చాలా మందికి కళ్ల దురదతో పాటు నొప్పి కూడా పెడుతుంది. ఇలాంటి వాటికి వైద్యుడిని సంప్రదించడం ముఖ్యం. అయితే కొన్ని చిట్కాలు మీ కంటి నొప్పి నుంచి తాత్కాలిక ఉపశమనాన్ని ఇస్తాయి. అవేంటో చూడండి. ప్రతీకాత్మక చిత్రం Ⓐ బ్రేక్ ముఖ్యం: మీరు స్క్రీన్‌పై ఎక్కువ సమయం గడుపుతున్నట్లయితే, ప్రతి 20 నిమిషాలకు 20 సెకన్ల విరామం తీసుకొని 20 అడుగుల దూరంలో ఉన్న వాటిని చూడటం మంచిది. 20-20-20 నియమాన్ని అనుసరించండి. ఇది చాలా రిలీఫ్ ఇస్తుంది. Ⓑ లైటింగ్: కాంతి ఎక్కువగా, ఓవర్‌గా ఉంటే అది మన కళ్లపై ఒత్తిడి పెంచుతుంది. ఇలా జరగకూడదంటే లైటింగ్‌ని అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది. బ్రైట్‌నెస్ మరి ఎక్కువగా ఉండకూడదు.. అలాగని డిమ్‌గా కూడా ఉండకూడదు Ⓒ రెప్ప: రెప్పవేయడం మీ కళ్లను తేమగా మార్చడంలో సహాయపడుతుంది. అప్పుడు కళ్ల దగ్గర వాటర్ జనరేట్ అవుతుంది. పొడిబారకుండా ఉంటుంది. ముఖ్యంగా డిజిటల్ పరికరాలను ఉపయోగిస్తున్నప్పుడు క్రమం తప్పకుండా బ్లింక్ చేయడాన్ని కన్సిడర్ చేయండి. Ⓓ స్క్రీన్ సెట్టింగ్: మీ సిస్టమ్ స్క్రీన్ బ్రైట్‌నెస్, కాంట్రాస్ట్, ఫాంట్ సైజ్ మన కళ్లపై నెగిటవ్ ఎఫెక్ట్ పడకుండా ఉండేలా చూసుకోండి. ఇవి మనకు సౌకర్యవంతంగా ఉండాలి. ప్రతీకాత్మక చిత్రం Ⓔ డ్రాప్స్: లూబ్రికేటింగ్ ఐ డ్రాప్స్ మీ కళ్లను తేమగా ఉంచడంలో సహాయపడతాయి. Ⓕ దూరం: కొంతమంది స్క్రీన్‌కు అతుక్కుపోయి కూర్చున్నట్టు ఉంటారు. అది అసలు కరెక్ట్ కాదు. మీ స్క్రీన్‌ను కంటికి కాస్త దూరంగా ఉంచండి. ఒత్తిడిని తగ్గించడానికి తగినంత దూరంలో కూర్చోవడం అవసరం. Ⓖ వాటర్: కళ్లు పొడిబారకుండా ఉండేందుకు తగినంత నీరు తాగండి. మంచినీళ్లు తాగుతూ హైడ్రెటెడ్‌గా ఉండడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి Ⓗ కంప్యూటర్ గ్లాసెస్: మీరు తరచుగా స్క్రీన్ ముందే పని చేస్తుంటేయాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్ ఉన్న కంప్యూటర్ గ్లాసెస్‌ను వాడవచ్చు. Ⓘ పరీక్షలు: క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకోవడం మంచిది. కంటి వైద్యుడిని సంప్రదించండి ఏవైనా సమస్యలు ఉంటే డాక్టర్‌కు చెప్పండి. విశ్రాంతి, నిద్ర: మీ కళ్లకు రెస్ట్ అవసరం. మీకు తగినంత విశ్రాంతి అవసరం. సరిపడా నిద్ర ఉండేలా చూసుకోండి. కంటి నొప్పి కొనసాగితే లేదా తీవ్రమవుతుంటే వైద్య నిపుణుడిని సంప్రదించండి. ఇది కచ్చితంగా చేయాలి. కేవలం ఇంటి చిట్కాలు, ఇంటర్‌నెట్ చిట్కాలపై డిపెండ్ అవ్వకండి. ఇది అసలు మంచిది కాదు. ALSO READ: మీ టూత్ పేస్ట్‌లో ఈ పదార్థం ఉందా? అయితే మీరు ఈ సమస్యలు కొని తెచ్చుకున్నట్లే! #health-tips-telugu #eye-care-tips మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి