Health Tips : మిగిలిన టీని పదే పదే వేడి చేసి తాగుతున్నారా? ఏమౌతుందో తెలుసుకోండి..!!

భారతీయులు చాలా మంది ఉదయం టీతోనే రోజును ప్రారంభిస్తారు. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు లెక్కలేనన్నిసార్లు టీ తాగేవారు చాలా మందే ఉన్నారు. టీ అనేది భారతీయులకు ఉత్తమ ఎంపిక. ఇంట్లోకి అతిథులు వస్తే చాలు..ముందుగా వారికి టీ ఇవ్వాల్సిందే. టీ తాగడం వల్ల మంచి, చెడు రెండూ ఉన్నాయి. ముఖ్యంగా కొంతమంది ఉదయం కాచిన టీని సాయంత్రం వరకు పదే పదే వేడి చేసుకుని తాగుతుంటారు. చల్లని టీని మళ్లీ వేడి తాగడం ద్వారా ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో తెలుసా? టీని మళ్లీ వేడి చేయడం వల్ల ఆరోగ్యానికి హానికలుగుతుందని చెబుతున్నారు హెల్త్ ఎక్స్ పర్ట్స్.

New Update

టీని మళ్లీ వేడి చేయడం వల్ల కలిగే నష్టాలు:
చాలా మంది టీని తయారుచేసినప్పుడు అందులో ఒకటి లేదా రెండు కప్పులు తాగి మిగిలింది అలాగే ఉంచుతారు. గంట లేదా రెండు గంటల తర్వాత దానిని వేడి చేసుకుని మళ్లీ తాగుతుంటారు. కానీ అలా చేయడం వల్ల మీ ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. వేడిచేసిన టీ తాగడం ఆరోగ్యానికి మంచిది కాదు. మళ్లీ వేడిచేసిన టీ రుచి కూడా పాడైపోతుంది. అయితే, టీ వెంటనే చల్లారినట్లయితే, మీరు దానిని వేడి చేసి త్రాగవచ్చు. టీని ఎక్కువ సేపు ఉంచి వేడి చేసి తాగడం ఆరోగ్యానికి మంచిది కాదు.

ఇది కూడా చదవండి: బతుకమ్మ కంటే ముందు నిర్వహించే బొడ్డెమ్మ పండుగ…ప్రాధాన్యత..!!

4 గంటల కంటే ఎక్కువసేపు ఉంచిన టీని పొరపాటున కూడా తాగకండి:
టీ వెంటనే చల్లారితే వేడి చేసి తాగవచ్చు కానీ ఎక్కువ సేపు ఉంచిన టీ మాత్రం తాగకూడదు. టీ తాగి 4 గంటలు దాటితే పొరపాటున కూడా మళ్లీ వేడి చేసుకుని తాగకండి. అందులో బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవులు పెరుగుతాయి. ఇవి మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. అనేక తీవ్రమైన వ్యాధులకు కూడా కారణమవుతాయి.

ఇవే వ్యాధులకు కారణం కావచ్చు:
వేడిచేసిన టీ తాగితే కడుపు నొప్పి, విరేచనాలు, తిమ్మిర్లు, వాపులు, వికారం మొదలైన సమస్యలు వస్తాయి. టీని మళ్లీ వేడి చేయడం వల్ల దాని రుచి, వాసన, పోషకాలు నాశనం అవుతాయి. టీ ఎల్లప్పుడూ తాజాగా తయారు చేసి త్రాగాలి.

ఇది కూడా చదవండి: పిల్లలు డెంగ్యూ భారిన పడకుండా ఉండాలంటే ఈ 7 చిట్కాలు పాటించండి..

Advertisment
Advertisment
తాజా కథనాలు