Health tips: ఏంటీ ఊరికే ఏదో ఒకటి తినాలనిపిస్తుందా.. అయితే మీకు ఈ సమస్యలు ఉన్నట్లే..!

ఆకలి అనేది శరీర సహజ ప్రక్రియ. కానీ అలా కాకుండా తరచూ తినాలనే భావన కలిగితే అది కొన్ని ఆరోగ్య సమస్యలకు సంకేతం అని నిపుణులు చెబుతున్నారు. మధుమేహ, ఒత్తిడి, మానసిక స్థితి, హైపర్ థైరాయిడిజం వంటి సమస్యలు అధిక ఆకలికి దారి తీస్తాయి.

Health tips: ఏంటీ ఊరికే ఏదో ఒకటి తినాలనిపిస్తుందా.. అయితే మీకు ఈ సమస్యలు ఉన్నట్లే..!
New Update

Health tips: కొంత మందికి టైంతో సంబంధం లేకుండా తరుచూ ఆకలి వేస్తుంది. ఆహారం తీసుకున్న కొంత సమయంలోనే మళ్లీ ఏదో ఒకటి తినేయలి అనే భావన కలుగుతుంది. అయితే ఆకలి అనేది శరీరానికి సంబందించిన ఒక సహజ లక్షణం. అది పద్ధతిగా టైం ప్రకారం ఉన్నప్పుడే ఆరోగ్యకరం. కానీ అలా కాకుండా విపరీతంగా తినాలనే భావన కలిగితే ఆరోగ్యానికి మంచిది కాదు. అందరూ ఇది సహజమే అని అనుకుంటారు కానీ దీని వెనుక కొన్ని ఆరోగ్య సమస్యలు ఉండవచ్చని నిపుణులు చెపుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాము..

ఇది కూడా చదవండి: పండ్లు నేరుగా తింటే బెటరా?.. జ్యూస్‌ చేసి తాగితే మంచిదా?

  • అధిక ఆకలి ఆరోగ్య సమస్యలకు మాత్రమే కాదు బరువు పెరగడానికి కూడా కారణమవుతుంది. తరచూ భోజనం చేయడం ద్వారా ఎక్కువ కేలరీలను తీసుకోవడం జరుగుతుంది. దీని వల్ల బరువు పెరిగే ప్రమాదం ఉంటుంది.
  • అధిక ఆకలి మధుమేహ ముఖ్య లక్షణం అని నిపుణులు చెబుతున్నారు. ఇలా అధిక ఆకలి భావన కలిగే వారు డయాబెటీస్ పరీక్షలు చేయించుకోవాలి. హైపర్ థైరాయిడిజం కూడా దీనికి కారణం.

publive-image

  • మానసిక స్థితి, ఒత్తిడి,హార్మోన్ల సమతుల్యత కూడా అధిక ఆకలికి కారణం. ఒత్తిడితో, మానసిక సమస్యలతో బాధపడేవారు తరచూ ఏదో ఒకటి తింటూ ఉంటారు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.
  • నిద్రలేమి సమస్యతో బాధపడేవారు కూడా అధిక ఆకలి వంటి సమస్యలను ఎదుర్కుంటారని నిపుణుల చెబుతున్నారు. ఇలాంటి సమస్యలు ఉన్నవారు డైటీషియన్ సలహాతో ఆహారంలో పట్ల శ్రద్ద తీసుకోవాలి.
  • గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: ఈ సమస్యలను లైట్‌ తీసుకుంటే కిడ్నీలు పోయే ప్రమాదం

#health-tips #health-effets-of-over-eating #feeling-hungry-oftenly
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe