Health Tips : పెరుగును వీటితో కలిపి తింటున్నారా.. అయితే జాగ్రత్త..!

పెరుగు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అయితే పెరుగును ఈ ఆహారాలతో కలిపి తింటే జీర్ణక్రియ సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణుల చెబుతున్నారు. ఆనియన్, ఫ్రైడ్ ఫుడ్స్, ఫిష్, మిల్క్, మామిడి పండుతో తినకూడదు.

New Update
Health Tips : పెరుగును వీటితో కలిపి తింటున్నారా.. అయితే జాగ్రత్త..!

Curd : భారతదేశ భోజనం(Indian Food) లో పెరుగు(Curd) అనేది అత్యంత ప్రధానమైన ఆహార పదార్థం. సీజన్ తో సంబందం లేకుండా ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే కామన్ ఫుడ్ ఐటం. పెరుగును చాలా రకాలుగా తింటారు. కొంత మంది మజ్జిగలా తాగుతారు, మరికొంత మంది అన్నంలో తినడానికి ఇష్టపడతారు. అంతే కాదు రకరకాల వంటకాల్లో కూడా పెరుగును ప్రధాన ఇంగ్రీడియంట్ గా వాడతారు. సాధారణంగా పెరుగు తినడం అందరికీ ఇష్టం. కాకపోతే దీన్ని తినేటప్పుడు కొన్ని జాగ్రత్తలు మాత్రం తప్పకుండా పాటించాలి. ముఖ్యంగా పెరుగును ఈ ఆహారాలతో కలిపి అస్సలు తినకూడదు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

పెరుగుతో కలిపి తినకూడని ఆహారాలు

ఉల్లిపాయ

చాలా మందికి ఉల్లిపాయ(Onions), పెరుగు కలిపి తినడం అలవాటుగా ఉంటుంది. కానీ ఈ రెండింటినీ అస్సలు కలిపి తినకూడదు. ఇవి రెండు విభిన్న స్వభావాలను కలిగి ఉంటాయి. ఒకటి చలువ, మరొకటి వేడి. అందుకే వీటిని కలిపి తింటే శరీరం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది.

ఫ్రైడ్ ఫుడ్స్

ఫ్రైడ్ ఫుడ్స్(Fried Foods) తో పెరుగు మిక్స్ చేయడం చాలా బ్యాడ్ కాంబినేషన్. ఈ రెండింటినీ కలిపి తింటే జీర్ణక్రియ సమస్యలను కలిగించే ప్రమాదం ఉంటుంది.

ఫిష్

పెరుగు, ఫిష్ కలిపి తినకూడదు. ఈ రెండింటిలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. యానిమల్ ప్రోటీన్(Animal Protein), ప్లాంట్ ప్రోటీన్ కలిసినప్పుడు జీర్ణమవడానికి ఇబ్బంది అవుతుంది.

మిల్క్

సాధారణంగా ఈ రెండు కలిపి తీసుకోరు. కానీ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే.. పాలు, పెరుగు కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది కాదు. కడుపుబ్బరం, గ్యాస్ సమస్యలకు కారణమవుతుంది.

మామిడి పండు

మామిడి, పెరుగు విభిన్న స్వభావాలతో ఉంటాయి. రెండు పుల్లటి పదార్థాలను కలిపి తినడం ద్వారా గ్యాస్ సంబంధిత సమస్యలు మొదలవుతాయి.

గమనిక : ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి :  మహాశివరాత్రి, మాసశివరాత్రికి మధ్య తేడా ఏంటి..?..రెండింటి ప్రాముఖ్యత ఇదే!

Advertisment
Advertisment
తాజా కథనాలు