kidney: ఒక కిడ్నీ పాడైతే, మరొకటి ఎంతకాలం ఉంటుంది? ఇక్కడ తెలుసుకోండి ఒక కిడ్నీ ఉంటే జీవించడానికి, సరైన జీవితాన్ని గడపడానికి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచాలి. దీనితోపాటు ఆహారాన్ని సమతుల్యం తీసుకోవాలి. ఆల్కహాల్, సిగరెట్ల, ఎక్కువ ఉప్పు, లవణం ఉన్న ఆహారాలు తినవద్దు. క్రమం తప్పకుండా నీరు తాగలి, వాకింగ్, వ్యాయామం చేయాలని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 30 Jun 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి kidney: మన శరీరంలో రెండు కిడ్నీలు ఉంటాయి. ఇది చాలా ముఖ్యమైన భాగం. నిరంతర శ్రమ వల్ల ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. రెండు కిడ్నీలలో ఒకటి చెడిపోతే ఆ వ్యక్తి సజీవంగా ఉండగలడు. అయితే ఇది అతనికి చాలా సమస్యలను కలిగిస్తుంది. ఒక వ్యక్తి ఒక కిడ్నీపై ఎంతకాలం జీవించగలడు అనేది అతిపెద్ద ప్రశ్న. ఆరోగ్య చిట్కాలతో ఒక కిడ్నీతో ఒక వ్యక్తి ఎంతకాలం జీవిస్తాడో తెలుసుకోవచ్చు. అయితే ఒక కిడ్నీ చెడిపోతే, మరొకటి ఎంతకాలం ఉంటాటరనే ప్రశ్నకు దీనికి సంబంధించిన సమాచారాన్ని ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఒక కిడ్నీ పాడైతే ఏమి జరుగుతుంది: ఒక కిడ్నీ విఫలమైన వారిలో చాలామంది ఒక కిడ్నీపైనే సాధారణ జీవితం గడుపుతున్నారని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఒక కిడ్నీ పూర్తిగా ఆరోగ్యంగా ఉంటే అది రెండు కిడ్నీలా పని చేస్తుంది. కానీ అందరికీ అలా ఉండదు. మూత్రపిండాలపై అధిక లోడ్ ఉన్నప్పుడు.. దాని నష్టం ప్రమాదం పెరుగుతుంది. వ్యక్తి తన జీవితాంతం ఒక కిడ్నీపై జీవించగలడా..? నేషనల్ కిడ్నీ ఫౌండేషన్ ప్రకారం.. చిన్నతనంలో పిల్లల కిడ్నీని తీసివేస్తే.. అతనికి జీవితంలో కొన్ని సమస్యలు ఉండవచ్చు. కానీ అతని జీవితం కూడా సాధారణంగా కొనసాగుతుంది. ఒక కిడ్నీపై జీవించడానికి, సరైన జీవితాన్ని గడపడానికి, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచాలి. ఒక కిడ్నీ చెడిపోతే జాగ్రత్తగా చూడాల్సిన విషయాలు: –>ఆహారాన్ని సమతుల్యంగా ఉంచాలి. ఎక్కువ, తక్కువ పోషకాలను తీసుకోవద్దు. –>ఆల్కహాల్, సిగరెట్లను వెంటనే మానేయాలి. –>ఎక్కువ ఉప్పు, లవణం ఉన్న ఆహారాలు తినవద్దు. –>బయటి వస్తువులను కూడా తినడం మానుకోవాలి. –>రోజూ వాకింగ్ కోసం బయటకు వెళ్లాళి. ఉదయం, సాయంత్రం ధ్యానం చేయాలి. –>తగిన మోతాదులో నీరు తాగలి. ఇది కిడ్నీలను శుభ్రపరుస్తుంది. –>శరీర బరువు పెరగనివ్వవద్దు. –>క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని నిపుణులు చెబుతున్నారు. గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. ఇది కూడా చదవండి: పొరపాటున ఈ ఐదు రహస్యాలను మీ భాగస్వామితో చెప్పకండి.. ఎగిరి తన్నే ప్రమాదం ఉంది! #kidney మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి