Winter : శీతాకాలం వచ్చేసింది...చిన్నారులు జర భద్రం!

రాష్ట్రంలో చలి (Winter) తీవ్రత రోజురోజుకి పెరుగుతోంది. సాయంత్రం నాలుగు గంటల నుంచే చల్లటి గాలులు మొదలు అయిపోయాయి. చలికాలం మొదలు అయ్యింది అంటే..చిన్న పిల్లలకు, వృద్ధులకు ఇది చాలా కష్టమైన కాలం.

Winter : శీతాకాలం వచ్చేసింది...చిన్నారులు జర భద్రం!
New Update

రాష్ట్రంలో చలి (Winter) తీవ్రత రోజురోజుకి పెరుగుతోంది. సాయంత్రం నాలుగు గంటల నుంచే చల్లటి గాలులు మొదలు అయిపోయాయి. చలికాలం మొదలు అయ్యింది అంటే..చిన్న పిల్లలకు, వృద్ధులకు ఇది చాలా కష్టమైన కాలం. వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల ఆరోగ్య పరిస్థితులు కూడా మారుతుంటాయి.

వాతావరణంలో చోటు చేసుకునే మార్పుల వల్ల శరీరం మొత్తం తెల్లగా పొడిబారిపోతుంది. పెదవులు పగిలిపోయి ముఖం కూడా కాంతిహీనంగా తయారవుతుంది. అరికాళ్లు పగిలిపోయి నడవడానికి కూడా రాదు. అంతే కాకుండా తేమ శాతం బాగా తగ్గిపోవడంతో దురదలు కూడా వస్తుంటాయి.

Also Read: స్టార్ యాంకర్ సుమ కుమారుడి సినిమా ఫస్ట్ లుక్‍ పోస్టర్ లాంచ్..!

చలికాలం మొదలైంది అంటే..ఇన్‌ ఫ్లూయెంజా, ఫ్లూ వైరస్‌, రైనో వైరస్‌ వంటివి దాడి చేస్తాయి. ఈ కాలంలో ఆస్తమా, సీవోపీడీ, న్యుమోనియా ఉన్న వారికి ఈ కాలం చాలా కష్ట కాలం అనే చెప్పుకోవాలి. చిన్న పిల్లలు ఉన్న వారు, వృద్ధులు ఈ కాలంలో తప్పని సరిగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

శీతాకాలంలో అందరూ ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు హైడ్రేషన్‌ విషయంలో. ఈ హైడ్రేషన్‌ నీటి వల్ల నీటి శాతం ఎక్కువగా ఉన్న కూరగాయలు తీసుకోవాలి. ఉదయాన్నే గోరు వెచ్చని నీళ్లు తాగాలి. స్నానానికి ముందు ఆలివ్‌ ఆయిల్‌ కానీ నువ్వులు నూనెతో శరీరాన్ని మసాజ్‌ చేసుకోవాలి.

తరువాత గోరు వెచ్చని నీటితో స్నానం చేయాలి. రోజుకి మూడు నాలుగు సార్లు మాయిశ్చరైజ్‌ చేసుకోవాలి. కాళ్లకి చెప్పులు వేసుకోకుండా నడవకూడదు. త్వరగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలు తీసుకోవాలి. కొబ్బరి నూనెతో రోజుకు నాలుగు సార్లు మాయిశ్చరైజ్‌ చేసుకోవాలి. నీళ్లు చాలా ఎక్కువగా తాగాలి. చల్లటి పదార్థాలను నీటిని తీసుకోకూడదు.

శరీరానికి ఎండ తగిలే సమయంలోనే జాగింగ్‌ చేయాలి. తలకు మంకీ క్యాప్ లు, చెవుల్లో దూది పెట్టుకోవాలి. కూల్‌డ్రింక్స్‌ తాగకూడదు. శ్వాసకోశ సమస్యలున్న వారు చలికాలంలో తిరగకూడదు. ఆస్తమా బాధితులు నిత్యం ఇన్‌ హీలర్‌ పెట్టుకోవాలి. బాగా వేడి, చల్లటి నీళ్లు కాకుండా గోరువెచ్చటి నీటితో స్నానం చేయాలి.సబ్బుల కంటే సున్నిపిండి, శనగపిండి వాడడం మేలు.

#season #winter
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe