Health Tips: రాత్రి 9 తరువాత బోజనం చేస్తున్నారా? ఎంత ప్రమాదో తెలుసా?

రాత్రిపూట ఆలస్యంగా తినడం వల్ల అథెరోస్క్లెరోసిస్, స్థూలకాయం, అసాధారణ లిపిడ్ ప్రొఫైల్స్, మహిళల్లో మెటబాలిక్ సిండ్రోమ్‌కు దారితీస్తుందని ఓ అధ్యయనంలో తేలింది. అందుకే రాత్రి 9 కంటే ముందుగానే తినాలని సూచిస్తున్నారు.

New Update
Health Tips: రాత్రి 9 తరువాత బోజనం చేస్తున్నారా? ఎంత ప్రమాదో తెలుసా?

Health Tips: కొత్త కొత్త పనులు, బిజీ షెడ్యూల్ కారణంగా.. జీవనశైలిలో మార్పులు చోటు చేసుకుంటాయి. భోజన వేళలు, నిద్ర సమయం కూడా మారిపోతుంది. అయితే, మన ఆహారం, నిద్ర.. మన ఆరోగ్యంపై చాలా ప్రభావాన్ని చూపుతాయని మీకు తెలుసా? మన భోజనం చేసే సమయం హృదయ ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో ఇటీవలి అధ్యయనం వెల్లడించింది. నేచర్ కమ్యూనికేషన్స్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం రాత్రి 9 గంటల తర్వాత ఆహారం తీసుకునే వారికి బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని గుర్తించారు.

మన శరీరం సర్కాడియన్ చక్రాలను అనుసరిస్తాయి. ఇది మన నిద్ర, ఆహారం, ఇతర రోజువారీ కార్యకలాపాలను ప్రభావితం చేస్తుంది. ఇది గుండె, రక్త నాళాల పనితీరును కూడా నియంత్రిస్తుంది. ఆహారం తీసుకోవడం, ఉపవాస సమయాలలో మార్పులు.. హృదయ సంబంధ వ్యాధుల సంభవం (CVD) మధ్య అనుబంధాన్ని అధ్యయనం నివేదించింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రజల్లో వ్యాధులు, మరణాలకు CVD ప్రధాన కారణం అని గుర్తించారు. అందుకే తప్పుడు ఆహారపు అలవాట్లు స్ట్రోక్‌కు ప్రధాన కారణమని అధ్యయనం చెబుతుంది. మన జీవక్రియ, హృదయనాళ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో భోజనం ప్రాముఖ్యతను పరిశోధన హైలైట్ చేస్తుంది. రాత్రిపూట ఆలస్యంగా తినడం వల్ల అథెరోస్క్లెరోసిస్, స్థూలకాయం, అసాధారణ లిపిడ్ ప్రొఫైల్స్, మహిళల్లో మెటబాలిక్ సిండ్రోమ్‌కు దారితీస్తుందని అధ్యయనంలో నిర్ధారించారు.

రాత్రి 9 గంటల తర్వాత తినడం ద్వారా.. పక్షవాతం వచ్చే ప్రమాదం 28 శాతం పెరుగుతుందని అధ్యయనం తెలిపింది. ఈ అధ్యయనం భోజన సమయానికి, హృదయం ఆరోగ్యానికి మధ్య ఉన్న సంబంధాన్ని వివరించింది. నైట్ షిఫ్ట్ పని, ఇతర జీవనశైలి అంశాలు ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయి. ఈ అధ్యయనం భోజన సమయాలు, సిర్కాడియన్ లయలు, మొత్తం ఆరోగ్యం మధ్య సంక్లిష్ట సంబంధంపై మరింత పరిశోధన అవసరం అని అభిప్రాయపడింది.

Also Read:

2024లో ఈ 4 రాశుల స్త్రీలకు పట్టిందల్లా బంగారమే..!

హైదరాబాదీలకు బిగ్ షాక్.. న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు..

Advertisment
తాజా కథనాలు