Dragon Fruit Benefits: పండ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఆరోగ్యాన్ని కాపాడటమే కాదు.. అందాన్ని కూడా పెంచుతాయి. శరీరంలో రోగనిరోధక శక్తి పెరగడానికి, ఆరోగ్యంగా ఉండటానికి సీజనల్ వారీగా ఫ్రూట్స్(Fruits) తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇలాంటి ఫ్రూట్స్‌లో డ్రాగన్ ఫ్రూట్(Dragon Fruit) ఒకటి. డ్రాగన్ ఫ్రూట్ తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది శరీరానికి అవసరమైన అన్ని పోషకాలను అందిస్తుంది. ఇంతకు ముందు డ్రాగన్ ఫ్రూట్ అంటే పెద్దగా తెలియదు. కానీ, ఇప్పుడు.. ఎక్కడపడితే అక్కడ మార్కెట్‌లో విరివిగా లభిస్తోంది. డ్రాగన్ ఫ్రూట్‌ను ఇప్పుడు మన దేశంలో విరివిగా పండిస్తున్నారు రైతులు. దీని ప్రయోజనాల కారణంగా.. ధర కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఇది తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఈ పండు కొన్ని వ్యాధులను కూడా నయం చేస్తుంది. వారానికి ఒకసారైనా ఈ పండును తింటే ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. డ్రాగన్ ఫ్రూట్ తినడం వలన కలిగే ప్రయోజనాలేంటో ఓసారి చూద్దాం..
చర్మ సంరక్షణ..
డ్రాగన్ ఫ్రూట్ తినడం వలన చర్మ సంబంధిత సమస్యలన్నీ తగ్గిపోతాయి. చర్మం కాంతివంతంగా ఉంటుంది. మచ్చలు తొలగిపోతాయి. ముఖానికి సహజ అందాన్ని ఇస్తుంది.
గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది..
డ్రాగన్ ఫ్రూట్ గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు ఈ పండు తింటే ప్రయోజనకరంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
రోగనిరోధక శక్తి పెరుగుతుంది..
డ్రాగన్ ఫ్రూట్ తినడం వలన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వ్యాధుల బారి నుంచి రక్షిస్తుంది. అంతేకాదు.. రక్తంలో షుగర్ లెవల్స్‌ని నియంత్రణలో ఉంచుతుంది.
జుట్టు దృఢంగా మారుతుంది..
డ్రాగన్ ఫ్రూట్ తినడం వలన జుట్టు సంబంధిత సమస్యలు కూడా తగ్గుతాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. వారానికి రెండుసార్లు ఈ పండు తినడం వలన జుట్టు ఆరోగ్యంగా, దృఢంగా, మృదువుగా మారుతుంది. జుట్టు రాలిపోవడాన్ని కూడా తగ్గిస్తుంది. అంతేకాదు.. అల్జీమర్ బాధితులకు కూడా ఈ డ్రాగన్ ఫ్రూట్ ఎంతో మేలు చేస్తుంది.
ఎములకను బలంగా మారుస్తుంది..
డ్రాగన్ ఫ్రూట్‌లో కాల్షియం మూలకం అధికంగా ఉంటుంది. దీనిని తినడం వలన ఎముకలు దృఢంగా మారుతాయి. శరీరానికి కొత్త ఉత్సాహాన్ని అందిస్తుంది.
క్యాన్సర్‌ని నియంత్రిస్తుంది..
డ్రాగన్ ఫ్రూట్‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది షుగర్‌ను నియంత్రించడంతో పాటు.. క్యాన్సర్ కణాలు వృద్ధి చెందకుండా అడ్డుకుంటుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.
Also Read:
Batukamma:గౌరమ్మను తల్లి గంగమ్మ ఒడిలో వదిలేసే సద్దుల బతుకమ్మ
Women Health: మహిళలూ బీ అలర్ట్.. ఈ 7 లక్షణాలు అస్సలు విస్మరించొద్దు..