సునీతా విలియమ్స్ కు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం..

అంతరిక్షంలో చిక్కుకున్న సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ దంపతులకు కొన్ని శారీరక సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. స్పేస్ లో గుర్వతాకర్షణ బలం సున్నాగా ఉండటంతో వారు బరువు తగ్గి కండరాలు,ఎముకల పై ప్రభావం పడే అవకాశముందని వారు అంటున్నారు.

New Update
సునీతా విలియమ్స్ కు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం..

భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్, వెటరన్ వ్యోమగామి బుచ్ విల్మోర్  జూన్ 5న ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుండి విజయవంతంగా బయలుదేరి జూన్ 22న షెడ్యూల్ ప్రకారం జూన్ 6న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. అయితే వారు ఇప్పటికే భూమికి తిరిగి వచ్చి ఉండాలి. కానీ కొన్ని సాంకేతిక కారణాల లోపంతో ల్యాండింగ్ ఆలస్యమైంది.ఈ సందర్భంలో, సునీత విలియమ్స్ ఎక్కువ రోజులు అంతరిక్షంలో ఉండటం వల్ల బరువు తగ్గడం, కండరాలు ఎముకల సాంద్రత తగ్గడం వంటి సమస్యలను ఎదుర్కోవచ్చు.

అంతరిక్షంలో గురుత్వాకర్షణ సున్నాగా ఉంటుంది. దీంతో  కండరాలకు ఎముకలకు బరువులు ఎత్తే పని ఉండదు. కాలక్రమేణా, కండరాల ఫైబర్స్ బలహీనపడతాయి. ఎముక కూడా బలహీనపడి విరిగిపోయే అవకాశం ఉంది. రోజంతా అంతరిక్షంలో ఉండడం వల్ల కళ్లపై ఒత్తిడి పెరిగి చూపు మసకబారుతుందని, డబుల్ విజన్ కనిపిస్తోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Advertisment
తాజా కథనాలు