AP News: ప్రమాద బాధితులకు అండగా ఉంటాం: మంత్రి సత్యకుమార్ అచ్యుతాపురం ఎస్ఈజెడ్‌లో ఫార్మాలో జరిగిన ఘటనపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై.సత్యకుమార్ స్పందించారు. ఈ ప్రమాదంలో మొత్తం 17 మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. ప్రమాద బాధితులకు అండగా ఉంటామన్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. By Vijaya Nimma 22 Aug 2024 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి AP News: అచ్యుతాపురం ఎస్ఈజెడ్‌లోని ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదం చాలా బాధ కలిగించిందని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అన్నారు. ఈ రోజు ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. ఈ ప్రమాదంలో దాదాపు 17 మంది ప్రాణాలు కోల్పోవడం, అనేక మంది క్షతగాత్రులు కావడంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించిందన్నారు. వెంటనే సీఎం అక్కడికి అధికారులను పంపారన్నారు. సంబంధిత అధికారులు అక్కడ సహాయక చర్యలు చేపట్టారని మంత్రి తెలిపారు. 35 మంది వివిధ ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారని సత్యకుమార్ అన్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఇటువంటి ప్రమాదాల వల్ల పాఠాలు నేర్చుకుని మళ్లీ జరగకుండా చూడాలన్నారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేలను ప్రధాని ప్రకటించారన్నారు. ప్రభుత్వం మృతుల కుటుంబాలకు అండగా ఉంటుందని ఆయన వివరించారు. సీఎం చంద్రబాబు స్వయంగా అక్కడకు చేరుకుని వారితో మాట్లాడుతున్నారని, ఇటువంటి ఘటనలు జరగకుండా అవసరమైన చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందని మంత్రి తెలిపారు. #ap-news మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి