Health Insurance: హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నారా..లేదా? ఈ విషయాలు తెలుసుకోండి 

హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ఆసుపత్రి అవుట్ పేషెంట్ ఖర్చులు అంటే OPD ఖర్చులు కవర్ అయ్యే పాలసీ తీసుకోవాలి. ఆసుపత్రి ఖర్చుల్లో 70 శాతం ఇవే ఉంటాయి. ఒకవేళ ఇప్పటికే హెల్త్ పాలసీ ఉంటే, దానికి OPD ఖర్చులను కవర్ చేసే యాడ్ ఆన్ తీసుకోవడం ఉపయోగకరంగా ఉంటుంది 

Health Insurance: గుడ్ న్యూస్.. హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం తగ్గుతుంది.. 
New Update

Health Insurance: ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో హెల్త్ ఇన్సూరెన్స్ అందరికీ తప్పనిసరి అవసరం. ఎందుకంటే, ఒక్కోసారి మన కుటుంబంలో ఎవరైనా అనారోగ్యం బారిన పడితే.. వారి ఆసుపత్రి ఖర్చులు మనల్ని రోడ్డున పాడేయవచ్చు. హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజి ఉంటే అటువంటి పరిస్థితిలో ఆర్ధిక ఇబ్బంది లేకుండా ఒడ్డున పడే  అవకాశం ఉంటుంది. అయితే,  చాలా మందికి వారు పని చేస్తున్న చోట గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం ఉంటుంది. దీంతో అది సరిపోతుంది కదా అని అనుకుంటారు. వాస్తవానికి గ్రూప్ ఇన్సూరెన్స్ అనేది సరిపోదు. ఎందుకంటే, గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ లో  హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కింద ఆసుపత్రి అవుట్ పేషెంట్ ఖర్చులు (OPD) కవర్ కావు.  అంతేకాదు ల్యాబ్ ఖర్చులు కూడా కవర్ అవ్వవు. ఆసుపత్రిలో చేరి తీసుకున్న చికిత్స అయితేనే గ్రూప్ ఇన్సూరెన్స్ లో కవర్ ఉంటుంది. అందువల్ల కచ్చితంగా  OPD ఖర్చులను కూడా కవర్ చేసే పాలసీ ఒకటి ప్రత్యేకంగా తీసుకోవడం తప్పనిసరి. 

ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ అంచనాల ప్రకారం సాధారణంగా ఎవరికైనా వైద్యానికి అయ్యే ఖర్చుల్లో దాదాపు 70 శతం వరకూ OPD ఖర్చులు, ల్యాబ్ టెస్ట్స్, డాక్టర్ ఫీజులకు అవుతాయి. ఇవన్నీ  చాలా  సాధారణ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో కవర్ కావు. 

మీకు ఒకవేళ ఇప్పటికే హెల్త్ ఇన్సూరెన్స్(Health Insurance) పాలసీ ఉండి దానిలో   OPD ఖర్చులు కవర్ కాకపొతే వెంటనే యాడ్ - ఆన్  OPD కవర్ తీసుకోవడం చాలా మంచిది. ఇది డాక్టర్ టెస్ట్స్ నుంచి వివిధ రకాల స్కాన్స్ , మెడిసిన్స్ వంటి ఖర్చులను కవర్ చేస్తుంది. 

Also Read: చాట్ జీపీటీలో వాయిస్ ఫీచర్.. అందరికీ అందుబాటులోకి.. 

యాడ్ ఆన్ OPD కవర్ ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేకుండా ఖర్చుల నుంచి రక్షణను అందిస్తుంది. ఈ కవర్‌లు కేవలం రూ. 500 నామమాత్రపు ప్రీమియం చెల్లింపుతో ప్రారంభమవుతాయి. మీరు రూ. 5,000 బీమా మొత్తం నుంచి ఏదైనా కవరేజ్ మొత్తానికి దీన్ని యాడ్ చేసుకోవచ్చు. 

ఉదాహరణకు బజాజ్ అలయన్జ్ ‘హెల్త్ ప్రైమ్’ పేరుతో యాడ్ ఆన్ రైడర్‌ను(Health Insurance) ఆఫర్ చేస్తోంది. ఇది దాని యాప్‌లో అందుబాటులో ఉంది. ఇలాంటి యాడ్ ఆన్స్ ఇతర కంపెనీలు కూడా అందిస్తున్నాయి. డాక్టర్  ఆన్‌లైన్ కన్సల్టెన్సీ సేవలు, పరీక్షలు, రిజిస్టర్డ్ ల్యాబ్ నుంచి ఇంటి సాంపిల్స్ సేకరించడం..  ఫిజియోథెరపీ సేవలు మొదలైన ప్రయోజనాలు ఉంటాయి. ఇది నగదు రహిత సౌకర్యాన్ని అందిస్తుంది. రూ. 63 నుంచి రూ. 2,300 ప్రీమియంతో వచ్చే దాదాపు 6 ప్లాన్‌లు ఉన్నాయి. ఈ ప్లాన్‌లు రూ. 15,000 నుంచి రూ. 25,000 వరకు కవర్‌ని అందిస్తాయి.

OPD కవర్‌ను ఎంచుకున్నప్పుడు, మీరు ఏ రకమైన ఖర్చులను కవర్ చేయాలనుకుంటున్నారో గుర్తుంచుకోండి. ఇన్సూరెన్స్ సంస్థ నెట్‌వర్క్ ఆసుపత్రులు, ల్యాబ్‌ల జాబితాను జాగ్రత్తగా చెక్ చేసుకోండి. మీకు అందుబాటులో ఉన్న హాస్పటల్స్ నుంచి సర్వీసులు అందుబాటులో ఉన్నాయా లేదా అన్నది కచ్చితంగా దృష్టిలో పెట్టుకుని పాలసీ తీసుకోవాలి. 

Watch this interesting Video:

#health-insurance #insurance
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe