హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు అవినీతిపై చర్యలు తీసుకోవాలి హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావుపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ LHPS ఆధ్వర్యంలో పలువురు నాయకులు ఛలో ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు వారిని అడ్డుకుని, నారాయణగూడ పీఎస్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు రాజేష్ నాయక్ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ అరెస్ట్‌లతో ఉద్యమాలను ఆపలేరంటూ మండిపడ్డారు. By Vijaya Nimma 30 Jun 2023 in రాజకీయాలు తెలంగాణ New Update షేర్ చేయండి గిరిజన హక్కులను కాపాడాలి ఏజెన్సీ చట్టాలకు తూట్లు పొడుస్తూ గిరిజన హక్కులను తుంగలో తొక్కుతూ.. బంధు ప్రీతీ చాటుకుంటున్న హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు హెల్త్ డైరెక్టరా? లేక టీఆర్ఎస్ నాయకుడా? అని ప్రశ్నించారు రాజేష్ నాయక్. హెల్త్ డైరెక్టర్ పై అనేకమార్లు ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావుకి ఫిర్యాదు చేసినా ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఇదంతా తెలిసిన సీఎం కేసీఆర్ దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తక్షణమే గడల శ్రీనివాసరావు అవినీతి అక్రమాలపై చర్యలు తీసుకుని గిరిజన హక్కులను కాపాడాలని వారు కోరారు. అవినీతి అక్రమాలపై పోరాటం చేస్తాం తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖలో అవినీతి అక్రమాలు రోజురోజుకు మితిమీరుతున్నాయన్నారు. హెల్త్ డైరెక్టర్ గత 5 సంవత్సరాలుగా అనేక అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు రాజేష్ నాయక్. శ్రీనివాసరావు గతంలో ఎన్ఆర్‌హెచ్‌ఎం సీపీవోగా పనిచేసినప్పుడు 20 కోట్ల 40 లక్షల అవినీతికి పాల్పడినట్లు ఇతనిపై డైరెక్టర్ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విచారణ జరిపి, నివేదిక నెంబర్ 10 ప్రకారం బలమైన చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగిందన్నారు. దళిత గిరిజన అవకాశాలను ఆదుకోవాలి అయితే.. ఈ విషయంలో శ్రీనివాసరావు తన పలుకుబడిని ఉపయోగించి జీవో నెంబర్ 90ని విడుదల చేయించారన్నారు. వెంటనే ఆ జీవోను రద్దుచేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.హెల్త్ డైరెక్టర్‌గా సీనియార్టీ ప్రకారం దళిత గిరిజన అధికారులకు అవకాశాలు కల్పించి వైద్య శాఖను గాడిలో పెట్టి ఆదుకోవాలన్నారు రాజేష్ నాయక్ . ప్రభుత్వ నిబంధన ప్రకారము ప్రభుత్వ ఉద్యోగులు ఎటువంటి స్వచ్ఛంద సంస్థలో స్థాపించి నడపకూడదు.. కానీ ప్రభుత్వ ఆదేశాలను ఖాతరు చేయకుండా డాక్టర్ జీఎస్ఆర్ ట్రస్ట్‌కు చైర్మన్‌గా ఉంటూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న శ్రీనివాస్‌రావుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాజేష్ నాయక్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గోండ్వాన సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు పాయం సత్యనారాయణ, ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రకాష్ రాథోడ్, రాష్ట్ర కార్యదర్శులు గోవింద్ నాయక్, కృష్ణ నాయక్, సురేష్ నాయక్, రవి నాయక్, నగేష్ నాయక్, రాష్ట్ర నాయకులు కేశవ్ నాయక్, దశరథ్‌నాయక్, నాగేశ్వరావు, సూర్య నాయక్, నందానాయక్, వాసునాయక్, అరుణ్ నాయక్‌లతో పాలు పలువురు పాల్గొన్నారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి