Millets : మధుమేహం ఉందా.. అయితే మీ డైట్ లో వీటిని యాడ్ చేయండి

మిలెట్స్ ఆరోగ్యానికి చాలా మంచివి. వాటిలో ఒకటి అరికెలు. డైలీ డైట్ లో వీటిని తీసుకుంటే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. రక్తంలో చక్కెర స్థాయిలు, అధిక బరువు , మలబద్దకం, కండరాళ్ళ బలహీనతను నియంత్రించడానికి సహాయపడతాయి.

New Update
Millets : మధుమేహం ఉందా.. అయితే మీ డైట్ లో వీటిని యాడ్ చేయండి

Millets Benefits: ప్రస్తుతం మిల్లెట్(Millet) ట్రెండ్ బాగా నడుస్తోంది. మిల్లెట్స్ లో పుష్కలమైన పోషకాలు ఉంటాయి. ఫైబర్, విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్(Anti Oxidant), ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. సహజంగా అధిక బరువు, మధుమేహం(Diabetes), కొలెస్ట్రాల్(Cholesterol) వంటి జీవన శైలి(Life Style) వ్యాధులతో బాధపడేవారు డైట్ లో వీటిని ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. వాటిలో ఒకటి అరికెలు. రోజూ ఆహారంలో అరికెలు తీసుకుంటే కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుుందాం..

అరికెల ప్రయోజనాలు

  • అరికెల్లోని అధిక ఫైబర్ జీర్ణక్రియ సమస్యలకు మంచి చిట్కాల పనిచేస్తుంది. జీర్ణ సమస్యలతో బాధపడే వారు రోజూ ఆహారంలో వీటిని తీసుకుంటే మంచి ప్రభావం ఉంటుంది. మలబద్దకం, గ్యాస్, కడుపుబ్బరం నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
  • వీటిలోని తక్కువ గ్లైసెమిక్ వ్యాల్యూ రక్తంలోకి గ్లూకోజ్ ను నెమ్మదిగా విడుదల చేస్తుంది. ఇది షుగర్ లెవెల్స్ ను నియంత్రించడానికి సహాయపడుతుంది. మధుమేహం ఉన్నవారికి అరికెలు సరైన ఎంపిక. డైలీ డైట్ లో వీటిని తీసుకుంటే ఆరోగ్యం పై మంచి ప్రభావం ఉంటుంది.

Millets

  • అధిక బరువు ఉన్నవారికి అరికెలు సరైన ఎంపిక. వీటిలోని హై ఫైబర్ ఆకలిని కలిగించదు. జీర్ణక్రియను నెమ్మది చేసి ఎక్కువ సమయం వరకు కడుపు నిండుగా ఉందనే భావనను కలిగిస్తుంది. దీంతో కేలరీ ఇంటెక్ తగ్గిపోతుంది.
  • ఇవి తక్కువ కేలరీలను కలిగి ఉండడంతో పాటు.. శరీరానికి పుష్కలమైన పోషకాలను అందిస్తాయి. విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి.
  • అరికెల్లోని ప్రోటీన్ కండరాళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. బరువు తగ్గాలనుకునే వారు ప్రోటీన్ కోసం వీటిని తీసుకోవడం సరైన ఎంపిక. తక్కువ కేలరీలతో పాటు శరీరానికి పుష్కలమైన ప్రోటీన్ అందుతుంది.
  • సహజంగా గ్లూటెన్ సున్నితత్వం ఉన్నావారికి అరికేలు మంచి చాయిస్ . వీటిలో గ్లూటెన్ కంటెంట్ చాలా తక్కువగా ఉంటుంది.

గమనికఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: వేసవిలో రోజుకు 3 కప్పుల కంటే ఎక్కువ కాఫీ లేదా టీ తాగితే ఏం జరుగుతుంది?

Advertisment
Advertisment
తాజా కథనాలు