/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/dalchina-chekka-jpg.webp)
ఇండియన్ కిచెన్స్ లో లవంగం, యాలకులు, దాల్చిన చెక్క, మిరియాలు వంటి మసాలాలు వంటల్లో వాడడం సహజం. కొంత మంది వీటిని కేవలం రుచి, సువాసన కోసం మాత్రమే వాడతారని అనుకుంటారు. కానీ వీటిని తీసుకుంటే ఆరోగ్యానికి లాభాలు కూడా ఉన్నాయి. వాటిలో ఒకటి దాల్చిన చెక్క. దాల్చిన చెక్క తీసుకుంటే కలిగే ఆరోగ్య లాభాలేంటి చూద్దాం..
దాల్చిన చెక్కతో కలిగే ప్రయోజనాలు
దాల్చిన చెక్కలో పుష్కలమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. వీటిలోని ప్రధాన సమ్మేళనాలు పాలిఫెనల్స్, ప్రోసైనిడిన్ యాంటీ ఆక్సిడెంట్ గుణాలను కలిగి ఉంటాయి. ఇవి కాలుష్యం, ఇంకా ఇతర కారణాల వల్ల శరీరంలోకి వచ్చే ఫ్రీ రాడికల్స్ తో పోరాడుతాయి. శరీరంలో ఫ్రీ రాడికల్స్ పెరుగుదల ఆక్సీకరణ ఒత్తిడికి కారణమవుతుంది. దీని వల్ల గుండే సంబంధిత వ్యాధులు.. పార్కిన్సన్స్ వ్యాధి, అమియోట్రోఫిక్ లాటరల్ స్క్లెరోసిస్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది. వీటిలోని యాంటి ఆక్సిడెంట్స్ ఈ ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
మధుమేహాన్ని నిర్వహించడంలో సహాయపడును
ఆహారపు అలవాట్లు, జీవన శైలి విధానాల వల్ల చాలా మందిలో మధుమేహ సమస్య వస్తుంది. ఆరోగ్యమైన ఆహారపు అలవాట్లు రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. అలాగే దాల్చిన చెక్క లోని పోషకాలు శరీరంలో ఇన్సులిన్ నిరధకతను తగ్గిస్తాయి. ఇది మధుమేహ సమస్యను తగ్గించడానికి తోడ్పడును.
యాంటీ ఇ్ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉండును
దాల్చిన చెక్కలతో ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడంట్స్ C- రియాక్టివ్ ప్రోటీన్ లెవెల్స్ ను తగ్గించి శరీరంలో వాపు, మంటను తగ్గిస్థాయి. అంతే కాదు వీటిలోని యాంటీ ఆక్సిడెంట్స్ శరీరానికి రక్షణ కవచంలా పనిచేస్తాయి. బయట నుంచి వచ్చే క్రిములు, వైరస్ తో పోరాడి రోగాల బారిన పడకుండ కాపాడతాయి.
గుండె ఆరోగ్యాన్ని కాపాడును
గుండె ఆరోగ్యాన్ని నిర్వహించడంలో దాల్చిన చెక్క ముఖ్య పాత్ర పోషించును. వీటిలోని పోషకాలు శరీరంలో ట్రైగ్లిజరైడ్స్, షుగర్, రక్తపోటును నిర్వహించి గుండె ఆరోగ్యాన్ని మెరుగ్గా చేయును. అంతే కాదు కొత్త కణజాల ఉత్పత్తికి దాల్చిన చెక్క సహాయపడును.