Black pepper: మిరియాలు.. వీటిని ఇంట్లో మనం చేసుకునే వంటకాల్లో ఒక స్పైస్ గా వాడుతుంటాము. అలాగే మిరియాలు దగ్గు, జలుబు వంటి సమస్యలు తగ్గించడానికి మంచి చిట్కాల పని చేస్తాయి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫలమేటరీ, విటమిన్ 'సి', యాంటీ మైక్రోబియల్ గుణాల రోగ నిరోధక శక్తిని కూడా పెంచడంలో సహాయపడతాయి. అంతే కాదు ఆహారంలో మిరియాలను తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో చూడండి..
మిరియాల తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
జీర్ణక్రియలో సహాయపడుతుంది
మన ఆహారంలో మిరియాలు తీసుకోవడం వల్ల.. అవి జీర్ణక్రియకు అవసరమయ్యే ఎంజైమ్స్ ను విడుదల చేసి జీర్ణక్రియ మెరుగ్గా జరిగేలా ఉపయోగపడతాయి. అలాగే శరీరంలో పోషకాల శోషణను కూడా పెంచుతుంది. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు జీర్ణక్రియ సమస్యలను దూరం చేసి జీర్ణక్రియ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
తల నొప్పి, మైగ్రేన్ సమస్యలు దూరం
రోజు ఉదయం నిద్ర లేవగానే నానబెట్టిన మిరియాల నీటిని తాగితే తల నొప్పి , మైగ్రేన్ సమస్యలు ఉన్న వారికి మంచి ఉపశమనం కలుగుతుంది.
మిరియాలలో ఉండే పైపరిన్ అనే పదార్ధం నాడి వ్యవస్థను ఉత్తేజ పరచడంతో పాటు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. మిరియాలు రక్త నాళికలను వ్యాపింపజేసి గుండెకు, మెదడుకు రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా చేస్తాయి.
Also Read: Chocolate : చాక్లెట్స్ అంటే ఇష్టమా.. అయితే ఇది తప్పక చూడండి..!
జీవక్రియను మెరుగుపరుస్తుంది
మిరియాలలోని థర్మోజెనిక్ లక్షణం జీవక్రియను పెంచడంతో పాటు శరీరంలోని అధిక కేలరీలను, కొవ్వును కరిగిస్తుంది. ప్రతిరోజు ఉదయాన్నే అల్లం, తులసి, నిమ్మరసంలో మిరియాలను వేసి కాసేపు వేడి చేసి తాగితే జీవక్రియను మెరుగుపరుస్తుంది.
రోగ నిరోధక శక్తిని పెంచే గుణాలు
మిరియాలలోని యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ 'సి', ఫ్లెవనాయిడ్స్ శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. తేనే, మిరియాలు కలిపి తీసుకుంటే వీటిలోని యాంటీ మైక్రోబియల్, యాంటీ ఫంగల్ గుణాలు దగ్గు, జలుబు సమస్యలకు అద్భుతంగా పని చేస్తాయి.
Also Read: Lung Health: వీటిని తాగితే.. మీ ఊపిరితిత్తులకు ఏ బాధ ఉండదు..!