Sun Bath: శీతాకాలంలో సన్‌బాత్‌ వల్ల కలిగే ప్రయోజనాలు..!

చలికాలంలో సన్‌బాత్‌ ఎంతో మంచిది. ఈ సీజన్‌లో ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారపు అలవాట్లతో పాటు దుస్తులు విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. సూర్యరశ్మిని ఆస్వాదించడం, ఎండలో ఎక్కువ సేపు గడపడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. రోగనిరోధక వ్యవస్థ మెరుగ్గా ఉంటుంది.

New Update
Health Tips : సూర్యుని ఉత్తరాయాణాన్ని ఆస్వాదించండి...సూర్యస్నానం చేయడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా.?

Sun Bath: చలికాలం వచ్చిందంటే చాలు అందరూ వేడివేడిగా ఉండాలని కోరుకుంటారు. చిన్నపాటి చలిని కూడా చాలామంది తట్టుకోలేక పోతారు. దాని నుంచి ఉపశమనం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. అయితే.. చలికాలంలో సన్‌బాత్ అనేది ఎంతో మేలు చేస్తుంది. ఈ సీజన్‌లో ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారపు అలవాట్లు, దుస్తులు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. దీంతోపాటు సూర్యరశ్మిని ఆస్వాదించడం కూడా చేయాలి. చిన్నపాటి సూర్యకాంతిలో కూర్చుంటే ఎంత సంతోషంగా ఉంటుంది. అంతేకాదు జలుబు, దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది. ఓవైపు వేసవిలో సూర్యకాంతికి దూరంగా ఉంటే.. చలికాలంలో మాత్రం సూర్యరశ్మికి ఎంతో ఇష్టపడతారు. సూర్యకాంతి చర్మశుద్ధి, వడదెబ్బకు కారణమవుతారు. కానీ.. శీతాకాలంలో వచ్చే సూర్యుడు శరీరాన్ని వెచ్చగా ఉంచడంతోపాటు ఆరోగ్యాన్ని ప్రోత్సహించేందుకు ఉపయోగపడుతుంది. చలికాలంలో ఆరోగ్యానికి మేలు చేసే సన్‌బాత్ యొక్క ప్రయోజనాలు ఇప్పుడు తెలుసుకుందాం.

సన్‌బాత్ వలన కలిగే ప్రయోజనాలు:

  • సూర్యకాంతి నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తి రక్తపోటును తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మేలు చేస్తుంది.
  • సూర్యకాంతి న్యూరోట్రాన్స్మిటర్ విడుదల చేస్తుంది. ఇది సంతోషం, మంచి భావాలను పెంచుతుంది.
  • చలికాలంలో సన్ బాత్ చేయడం వల్ల విటమిన్ డి ఉత్పత్తి అవుతుంది. ఎముకలు, రోగనిరోధక వ్యవస్థ, మానసిక స్థితికి ఇది అవసరం.
  • ఉదయం సమయం సహజ సూర్యకాంతిలో గడపడం వల్ల మంచి నిద్ర వస్తుంది.
  • సూర్యరశ్మి విటమిన్ డి రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది.ఇది శరీరం ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది.
  • సూర్యరశ్మి వల్ల శరీరంలో విటమిన్ డి ఉత్పత్తి అవుతుంది. ఇది చర్మ సమస్యల నుంచి ఉపశమనం, చర్మాన్ని ఆరోగ్యవంతంగా చేస్తుంది.
  • బద్ధకం ఉంటే సూర్యరశ్మి వల్ల శక్తి స్థాయి పెరుగుతుంది. అలసట నుంచి ఉపశమనం లభిస్తుంది.

ఇది కూడా చదవండి: ఈ గుడికి వెళ్తే చాలు.. పెళ్లి పీటలెక్కాల్సిందే..!!

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
తాజా కథనాలు