Spending Time in Nature: పచ్చటి ప్రకృతి అందాలంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఆ అందాలు చూసినప్పుడు ఇంకా వెయ్యిళ్లు బతకాలనిపిస్తుంది. మనిషి జీవితానికి ఈ ప్రకృతి ఓ వండర్ ఫుల్ గిఫ్ట్ అని చెప్పాలి. ఈ ప్రకృతి అందాలు చూస్తు ఆనందంగా, ఆడినా, పాడినా మనసుకు ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. అంతేకాదు ప్రకృతి ఆస్వాదనతో నిత్య యవ్వనం.. వృద్ధాప్యాన్ని అడ్డుకుంటుందని నార్త్ కరోలినా స్టేట్ యూనివర్సిటీకి (NC State University) చెందిన పరిశోధకుల అధ్యయనంలో తెలింది. పర్యావరణం, పచ్చని ప్రదేశాలు, బయోలాజికల్ ఏజింగ్ కంట్రోలింగ్‌లో ఎలా దోహద పడతాయో అనే దానిపై ఫోకస్ పెట్టారుట. ప్రకృతిని ఆస్వాదించడం, పచ్చటి ప్రదేశాల్లో ఎక్కువసేపు గడపడం ఆరోగ్యానికి(Health) మంచిదని చెబుతున్నారు. అంతేకాదు.. వృద్ధాప్య లక్షణాలను అడ్డుకోవడంలోను, యవ్వనంగా కనిపించడంలోను నేచర్ కీ రోల్ పోషిస్తుంది. గ్రీన్‌స్పేస్ సెల్యులార్- లెవల్స్ ఇంపాక్ట్స్‌ను తెలుసుకునే ఉద్దేశంతో కొంతమందిని పరిశీలించగా తాజా ఈ విషయం బయట పడింది.
మానసిక, శారీరక ఆరోగ్య శ్రేయస్సుపై సానుకూల ప్రభావం
అందమైన ప్రకృతి, ఆకు పచ్చని ప్రదేశాల్లో ఎక్కువ సమయం గడపడం వలన శరీరంలోని టెలోమియర్స్, క్రోమోజోమ్స్ ఎండింగ్‌లో ఉండే ప్రొటెక్టివ్ క్యాప్స్ వృద్ధాప్యం త్వరగా రానివ్వకుండా అడ్డకుంటున్నట్లు పరిశోధకులు గుర్తించారు. వాస్తవానికి మన శరీరంలో వయస్సు పెరుగుతున్న కొద్దీ కణాల విభజనలో మార్పులు వచ్చి టెలోమియర్స్ అనేది తగ్గుతుంది. దీనివల్ల వృద్ధాప్యం త్వరగా వస్తుంది. కానీ.. ప్రకృతి ఆస్వాదన మానసిక, శారీరక ఆరోగ్య శ్రేయస్సుపై సానుకూల ప్రభావం పడి దీనిని అడ్డుకుంటుందని పరిశోధకులు అంటున్నారు.
ఇది కూడా చదవండి: ఆఫీస్‌లో మీపై అసూయ ఉన్నవారి పట్ల ఎలా ఉండాలంటే!
దీనికి ముఖ్య కారణం మెరుగైన మానసిక ఆరోగ్యం, మంచి రోగనిరోధక వ్యవస్థ (Immune System) మెరుగు పడటం వలన ఇది సాధ్యం అవుతుందాటున్నారు. అంతేకాకుండా.. గుండె ఆరోగ్యానికి కూడా స్వచ్ఛమైన గాలి ఎంతో అవసరం. పచ్చటి ప్రదేశాలు, పర్యావరణం వృద్ధాప్యాన్ని అడ్డుకోవడమే కాకుండా, వాతావరణ కాలుష్యాన్ని, మానసిక ఒత్తిడిని కూడా తగ్గిస్తాయని వైద్యలు చెబుతున్నారు. ఫిజికల్ యాక్టివిటీ, సోషల్ ఇంటరాక్షన్ వంటి చర్యలను ప్రోత్సహించడంలోనూ పార్కులు, ఆకు పచ్చటి ప్రదేశాలు కీలక పాత్ర పోషిస్తుంటాయి. కావున పచ్చటి ప్రదేశాలకు వెళ్లడం వలన అన్ని విధాలా ఆరోగ్యానికి మేలు కలుగుతుంది.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.