Strawberries: కీళ్ల నొప్పులు, మధుమేహ సమస్య వేదిస్తుందా.. అయితే ఈ పండు తినండి స్ట్రాబెర్రీస్ లో పుష్కలమైన పోషకాలు ఉంటాయి. రోజూ తినే ఆహారంలో వీటిని తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. వీటిలోని హై ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్ , మినరల్స్ కంటి చూపు, చర్మం, గుండె, జీర్ణక్రియ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. By Archana 20 Feb 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Strawberries: మార్కెట్ లో లభించే ఎన్నో రకాల పండ్లు లభిస్తాయి. వాటిలో ఒకటి స్ట్రా బెర్రీ. వీటిని యోగర్ట్, డెజర్ట్స్, సలాడ్స్ వంటి ఆహార పదార్థాల్లో మిక్స్ చేయడం ఎక్కువగా గమనిస్తుంటాము. పైకి ఎర్రగా అందంగా కనిపించే ఈ పండు ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. వీటిలోని విటమిన్ C, ఫైబర్, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్స్ వంటి పుష్కలమైన పోషకాలు మధుమేహం, గుండె, కంటి చూపు సమస్యలను తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు. స్ట్రాబెర్రీస్ తింటే కలిగే మరిన్ని ప్రయోజనాలు ఇప్పుడు తెలుసుకోండి.. చక్కర స్థాయిలను తగ్గించును స్ట్రాబెర్రీస్ తక్కువ కేలరీలను కలిగి ఉంటాయి. వీటిలోని తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్, పాలీఫేనాల్స్ రక్తంలో చక్కర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. మధుమేహ రోగులు వారి ఆహారంలో వీటిని చేర్చడం ద్వారా ఆరోగ్యం పై మంచి ప్రభావం ఉంటుంది. చర్మ ఆరోగ్యం స్ట్రాబెర్రీలోని యాంటీ ఇన్ఫలమేటరీ గుణాలు చర్మ సమస్యలను తగ్గిస్తాయి. స్ట్రాబెర్రీ బేస్డ్ బ్యూటీ ప్రాడక్ట్స్ చర్మాన్ని UV రేడియేషన్ నుంచి రక్షిస్తాయి. కీళ్ల నొప్పులు అధ్యయనాలు.. స్ట్రాబెర్రీలోని యాంటీ ఇన్ఫలమేటరీ గుణాలు కీళ్లు, మోకాళ్ళ నొప్పుల, వాపు వంటి సమస్యలను తగ్గిస్తాయని చెబుతున్నాయి. ఆస్టియో ఆర్థరైటిస్ సమస్య ఉన్నవారు డైలీ డైట్ లో 50 గ్రామ్స్ స్ట్రాబెర్రీస్ తీసుకుంటే మంచి ప్రభావం ఉంటుందని నిపుణుల సూచన. జీర్ణక్రియ సమస్యలు స్ట్రాబెర్రీస్ లో పుష్కలమైన ఫైబర్ లభిస్తుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరిచి.. మలబద్దకం, కడుపుబ్బరం సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది. మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి అధ్యనాల ప్రకారం బ్లూ బెర్రీస్, స్ట్రా బెర్రీస్ తిన్న వారిలో జ్ఞాపక శక్తి క్షీణత తక్కువగా ఉన్నట్లు పేర్కొన్నాయి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్స్ అల్జీమర్స్ , డెమెన్షియా వ్యాధులు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తాయి. అలాగే వీటి యాంటీ ఇన్ఫలమేటరీ ప్రభావం.. మెదడు ఆరోగ్యాన్ని రక్షించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. కంటి చూపు స్ట్రాబెర్రీలోని పుష్కలమైన యాంటీ ఆక్సిడెంట్స్ కంటి శుక్లాలు, కంటి చూపు క్షీణత సమస్యలను దూరం చేయడంలో సహాయపడతాయి. అంతే కాదు వీటిలోని విటమిన్ సి.. కళ్ళను ఫ్రీరాడికల్ ప్రభావం నుంచి కాపాడుతుంది. గుండె ఆరోగ్యం స్ట్రాబెర్రీస్ శరీరంలో “Nrf2.”అనే ప్రోటీన్ ను ఉత్తేజపరుస్తుంది. ఇది అధిక కొలెస్ట్రాల్ తో పాటు చెడు కొవ్వులను తగ్గిస్తుంది. రక్తపోటు వచ్చే ప్రమాదం నుంచి కూడా రక్షిస్తుంది. #strawberries #health-benefits-of-strawberries మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి