Health benefits of Spices: సాధారణంగా ఇంట్లో చేసుకునే ప్రతీ వంటకాల్లో ,మసాలాలు వాడుతుంటాము. స్పైసెస్ రుచికి మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా చాలా లాభాలను ఇస్తాయి. ముఖ్యంగా స్పైసెస్ లో వీటిని తీసుకుంటే ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. పసుపు, జీర, దాల్చిన చెక్క, దనియా, అల్లం, మెంతులు, మిరియాలు, సోంపు, వీటిని తప్పకుండా వాడండి.
పసుపు,
పసుపులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఫ్రీ రాడికల్స్ నుంచి పోరాడి ఆక్సిడేటివ్ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడును.
జీరా
జీరా యాంటీ ఇన్ఫలమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి శరీరంలో వాపు, మంటను తగ్గించడంలో సహాయపడును. అంతే కాదు వీటిలో విటమిన్ C, ఐరన్ వంటి పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచి ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడును.
దనియాలు
ఇవి రక్తంలోని చక్కర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడును. వీటిలోని పోషకాలు జీర్ణక్రియ, గుండె, చర్మం, మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
అల్లం
అల్లంలో యాంటీ ఇన్ఫలమేటరీ గుణాలు ఇన్ఫెక్షన్, వాపును తగ్గించును. అజీర్ణత, కడుపుబ్బరం, గ్యాస్ వంటి జీర్ణక్రియ సమస్యలను దూరం చేయును.
మెంతులు
మెంతుల్లో సోలబుల్ ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ లెవెల్స్ ను తగ్గించి.. గుండె ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచడంలో తోడ్పడును. అంతే కాదు రక్తంలోని చక్కర స్థాయిలను కూడా నియంత్రించును.
లవంగాలు
లవంగంలోని యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ మైక్రోబియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని బ్యాక్టీరియా, వైరస్ ల నుంచి కాపాడును. నోటిలో దురువాసన, శరీరంలో ఆక్సిడేటివ్ ఒత్తిడిని దూరం చేయును.
మిరియాలు
వీటిలోని పైపరిన్ గుణాలు జీర్ణక్రియను మెరుగుపరుచును. అంతే కాదు జీర్ణక్రియ సమస్యలు కడుపుబ్బరం, గ్యాస్ సమస్యలను తగ్గించును.
వాము
వామలో జీర్ణక్రియకు అవసరమయ్యే ఎంజైమ్స్ ను ఉత్పత్తి చేసి జీర్ణక్రియ ఆరోగ్యాన్ని మెరుగ్గా చేయడంతో పాటు అజీర్ణత సమస్యలను దూరం చేయును.
Also Read: Mushroom Benefits: వామ్మో మష్రూమ్ తింటే.. ఇలా జరుగుతుందా..!