/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-16-4-jpg.webp)
pomegranate Helath: దానిమ్మలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఫ్లేవనాయిడ్స్, ఆంథోసైనిన్స్, ఎల్లాగిటానిన్స్, ఎక్కువగా ఉంటాయి. అలాగే వీటిలోని యాంటీ ఇన్ఫ్లమే టరీ గుణాలు శరీరంలో బ్యాక్టీరియా, వైరస్ ప్రభావం నుంచి కాపాడతాయి. డైలీ డైట్ లో దానిమ్మ తీసుకుంటే ఆరోగ్యానికి చాలా లాభాలు ఉన్నాయి. దానిమ్మ తింటే కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం
గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుచును
అధ్యయనాల ప్రకారం దానిమ్మలో పాలిఫెనలిక్ కాంపౌండ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యం పై మంచి ప్రభావం చూపుతాయి. హార్ట్ సంబంధిత వ్యాధులతో బాధపడేవారు రోజు తినే ఆహారంలో దానిమ్మ జ్యూస్ తీసుకుంటే ఎంతో మేలు చేస్తుంది. అలాగే ఇది చెస్ట్ పెయిన్ వంటి సమస్యల తీవ్రతను తగ్గించడానికి సహాయపడతుంది.
Also Read: Skin Fasting: స్కిన్ ఫాస్టింగ్.. ఎప్పుడైనా విన్నారా..? దీంతో మీ చర్మం మరింత యవ్వనం
జీర్ణక్రియ ఆరోగ్యం
దానిమ్మలో ఫైబర్ శాతం అధికంగా ఉంటుంది. ఇది పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అంతే మలబద్ధకం, కడుపుబ్బరం, వంటి జీర్ణక్రియ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఉదయాన్నే వీటిని తీసుకుంటే కడుపు ఫుల్ గా ఉంచి.. శరీరంలో కెలారీ ఇంటేక్ తగ్గిస్తుంది. ఇది బరువు తగ్గడానికి సరైన ఎంపిక.
మెదడు ఆరోగ్యానికి మంచిది
వీటిలో ఎల్లాగిటానిన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి బ్రెయిన్ లో ఆక్షికరణ ప్రభావాన్ని తగ్గించి.. బ్రెయిన్ సెల్స్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అంతే కాదు అల్జీమర్స్ లాంటి బ్రెయిన్ సమస్యల నుంచి పోరాడడంలో ఎల్లాగిటానిన్స్ ఎఫెక్టివ్ గా పని చేస్తాయి.
రోగనిరోధక శక్తిని పెంచును
దానిమ్మలో యాంటీ ఆక్సిడెంట్స్ , యాంటీ మైక్రోబియల్ గుణాలు ఎక్కువ ఉంటాయి. ఇవి శరీరంలో రోగిరోధక శక్తిని పెంచుతాయి. బ్యాక్టీరియా, వైరస్ ల నుంచి పోరాడి ఆరోగ్యంగా ఉంచుతాయి .
Also Read: Blue Light Effects: బ్లూ లైట్ నుంచి కంటిని రక్షించే టిప్స్ .. తప్పక తెలుసుకోండి